బ్లాక్ కాఫీతో ఆ సమస్యలన్నీ పరార్

- Advertisement -

నేడు ప్రతి ఒక్కరూ తమ రోజూవారి జీవితాన్ని టీనో లేక కాఫీతోనే ప్రారంభించేస్తున్నారు. అయితే ఇప్పటికే నిపుణులు టీ, కాఫీలు శరీరానికి ఏ విధంగా హానీ చేస్తాయో తెలిపారు. అయితే కాఫీలలో బ్లాక్ కాఫీ శరీరానికి ఎంతో మేలు అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ బ్లాక్ కాఫీ అలవాటున్న వారందరికీ గుండె ఆగే ప్రమాదం 12 శాతం తగ్గిందని తెలుపుతున్నారు శాస్త్రవేత్తలు.

కొలరాడో స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేసిన పరిశోధనలో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. ఈ పరిశోధన 21 వేల మందిపై చేసి ఈ విషయాన్ని వెళ్లడించారు. అయితే కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లకు శరీర మంటను తగ్గించే గుణం ఉంటుంది. దాంతో గుండె ఆగే ప్రమాదం తగ్గుతుందట. అలాగే కాఫీ తాగే వారికి క్యాన్సర్ ముప్పు ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -

రోజూ వారిగా ఈ బ్లాక్ కాఫీ తాగే వారిలో 10 శాతం ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం తగ్గిందన్న విషయాన్ని ఇటీవలె చైనా మెడికల్ యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఇకపోతే ఇప్పటికే ఈ బ్లాక్ కాఫీ వల్ల పేగు, కాలెయం, రొమ్ము క్యాన్సర్ వంటి వాటికి దూరంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలూ స్పష్టం చేశారు. సో శరీరానికి హాని చేసే టీ, కాఫీలకు స్వస్తి చెప్పి ఈ బ్లాక్ కాఫీని అలవాటు చేసుకుని మీ ఆయుష్షును పెంచుకోండి.

మామిడితో బరువు పెరుగుతారా?

నోరూరించే హోళీ స్పెషల్స్

తిరుపతి ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ !

రెండో ప్రపంచ యుద్ధంలో నాగార్జున !

స‌మ్మ‌ర్ స్పెష‌ల్.. నిమ్మకాయ జ్యూస్‌

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -