Friday, May 10, 2024
- Advertisement -

బాహుబలి 2 వీడియో లీక్!

- Advertisement -
baahubali the conclusion war sequences leaked in internet

ప్రపంచవ్యాప్తంగా.. బాహుబలి సినిమా ఏ రెంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ చిత్రం సృష్టించిన రికార్డుల ప్రభంజనం అంతా ఇంతా కాదు. బాహుబలి మొదటి బాగం సూపర్ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు రాబోతున్న రెండో భాగం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

బాహుబలి మొదటి బాగం కంటే ఇప్పుడు రెండో భావంను మరింత విజవల్ వండర్ గా తెరకేక్కిస్తున్నాడు. అసలు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న ప్రశ్న గురించి యావత్ ప్రపంచం ఆలోచించుకుని డిస్కస్ చేసుకుని దాని గురించి డిబేట్ కూడా చేసుకునేలా చేశాడు మన రాజమౌళి. అయితే అదే క్రమంలో ఈ సినిమా మొదలి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో అన్న విషయం పక్కన పెడితే రెండో భాగంపై చాలా ఆశలే పెట్టుకున్నారు మన ప్రేక్షక దేవుళ్ళు.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో అనుకోకుండా ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ఆన్ ;లైన్ లో ప్రత్యక్షమవడంతో అందరూ ఒక్కసారిగా అవ్వాక్కు అయ్యారు. దాదాపుగా రెండు వీడియోలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నాయి. షాట్ నంబర్6 నుంచి షాట్ నంబర్ 60 వరకూ యుద్దానికి సంభందించిన సీన్స్ లీక్ అయ్యినట్లు తెలుస్తుంది అయితే ఆ వీడియోస్ ను చూసి ఒక పక్క నెటిజెన్స్ ఎంజాయ్ చేస్తుంటే మరో పక్క అంతటి భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇలా పైరసీ భారిన పడటం నిజంగా చాలా బాధాకరం.

Related

  1. బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఆకస్మిక ఐటీ దాడులు!
  2. చంద్రబాబుకు, బాహుబలి విలన్‌కు సంబంధమేంటి?
  3. బాహుబలి-3 లో రాజుగా ఎన్టీఆర్!
  4. బాహుబలి ఆ ? హాహాహ అంటున్న నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -