Thursday, May 16, 2024
- Advertisement -

బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఆకస్మిక ఐటీ దాడులు!

- Advertisement -
it rides on baahubali movie producers house offfice

దేశ వ్యాప్తంగా రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ 500, 1000 స్థానంలో కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లను ప్రవేశ పెట్టారు మోడీ. బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ లాంటి వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. ఇండస్ట్రీలో చాలా మంది నిర్మాతలు, హీరోలు, హీరోయిన్లు, కొందరు నటుల వద్ద బ్లాక్ మనీ ఉందని, వాటిని ఏం చేయాలో తోచక అంతా సతమతం అవుతున్నారనే ప్రచారం జోరందుకుంది. కొందరు నిర్మాతలు…. రహస్యంగా దాచిన బ్లాక్ మనీని బయటకు తీసి దాన్ని చిన్న చిన్న మొత్తాలుగా విభజించి తమ వద్ద పని చేసే పని వారు, సన్నిహితులతో బ్యాంకుల్లో వేయించి వైట్ గా మార్చుకుంటున్నారనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే బాహుబలి నిర్మాతల ఇళ్లపై ఐటీశాఖ ఆకస్మిక దాడులకు పాల్పడింది. ఏకకాలంలో నిర్మాతలు శోభుయార్లగడ్డ, ప్రసాద్ ఇళ్లపై రైడ్స్ నిర్వహించి సోదాలు నిర్వహిస్తున్నారు. బ్లాక్ మనీ అనుమానాలతోనే ఈ దాడులు నిర్వహించినట్లు సమాచారం.  గతేడాది విడుదలైన బాహుబలి మూవీ బాక్సాఫీసు వద్ద రూ. 650 కోట్ల వరకు వసూలు చేసిన సంగతి తెలిసిందే. మరి నిర్మాతలు వసూళ్ల లెక్కలు సరిగా చూపారా? టాక్స్ చెల్లింపు విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకున్నారా? వారి వద్ద బ్లాక్ మనీ ఏమైనా ఉందా? కోణంలో ఈ దాడులు జరిగినట్లు సమాచారం.

Related

  1. చంద్రబాబుకు, బాహుబలి విలన్‌కు సంబంధమేంటి?
  2. ‘బాహుబలి 2’ ఫస్ట్‌లుక్‌ సంచలనం సృష్టిస్తోంది!
  3. బాహుబలి 2కి అదిరిపోయే ఆఫర్!
  4. బాహుబలి కోసం రాజమౌళి వారిని ఒద్దు అనుకున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -