Monday, May 20, 2024
- Advertisement -

క‌ళ్యాణ్‌రామ్ ఇజం ప్రీ రివ్యూ!

- Advertisement -
ism movie pre review talk

నంద‌మూరి హీరో క‌ళ్యాణ్‌రామ్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇజం. ఈ సినిమా శుక్ర‌వారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో క‌ళ్యాణ్‌రామ్ సిక్స్ ప్యాక్ బాడీతో… కొత్త హెయిర్ స్టైల్ తో.. కొత్త బాడీ లాంగ్వేజ్‌తో కనిపించనున్నారు. బాలీవుడ్ భామ ఆదితి ఈ సినిమా తో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంకు క‌థ‌, క‌థ‌నంతోపాటు మాట‌లు కూడా పూరినే అందించారు. ఇజం జ‌ర్న‌లిజం బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కుతోంది.

భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పై టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో ఎలాంటి టాక్ వినిపిస్తుందో చూద్దాం. జ‌ర్న‌లిజం బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కే ఇజంలో క‌ళ్యాణ్‌రామ్ ఓ న్యూస్ ఛానెల్ రిపోర్ట‌ర్‌గా క‌నిపిస్తుంటాడు. ఓ స్టింగ్ ఆప‌రేష‌న్‌లో క‌ళ్యాణ్ కొన్ని భ‌యంక‌ర‌మైన నిజాలు తెలుసుకుంటాడు. ప‌నామా పేప‌ర్స్ లీకేజ్ నేప‌థ్యంలోను, మ‌న‌దేశంలో ఉన్న బ‌డాబాబుల నల్ల‌ధ‌నం నేప‌థ్యంలోను ఇజం సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక జ‌ర్న‌లిజం గొప్ప‌ద‌నంతో పాటు అందులో ఉన్న లొసుగుల‌ను కూడా పూరి ఇజంలో చ‌క్క‌గా చూపించాడ‌ట‌. క‌ళ్యాణ్ దేశంలో మూలుగుతున్న వేలాది కోట్ల రూపాయ‌ల న‌ల్ల‌ధ‌నాన్ని త‌న స్టింగ్ ఆప‌రేష‌న్‌తో బ‌ట్ట‌బ‌య‌టు చేస్తాడ‌ట‌. 

ఇజం ఫ‌స్టాఫ్ లో హీరో, హీరోయిన్ల మ‌ధ్య ల‌వ్‌ట్రాక్‌తో పాటు స‌ర‌దా స‌ర‌దా స‌న్నివేశాల‌తో సాగిపోతుంద‌ట‌. ఇక అదే టైంలో ఎల‌క్ట్రానికి మీడియాలో జ‌రిగే సీన్లు… ఛానెళ్ల‌లో ఎలాంటి వాతావ‌ర‌ణం ఉంటుందో పూరి చూపించాడ‌ట‌. ఫ‌స్టాఫ్ కామెడీగా, జాలీగా గ‌డిచిపోతుంద‌ట‌. ఇక ఇంట‌ర్వెల్‌తో అస‌లైన ట్విస్ట్ స్టార్ట్ స్టోరీ అస‌లైన క‌థ‌లోకి ఎంట్రీ అవుతుంద‌ని తెలుస్తోంది.

ఇక సెకండాఫ్‌లో సినిమా అస‌లైన క‌థ‌లోకి వెళ్లీ… వికీ లీక్స్, ప‌నామా లీక్స్ వంటి సీరియ‌స్ స‌బ్జెక్ట్ నేప‌థ్యంతో సాగుతుంద‌ని తెలుస్తోంది. సెకండ్ హాఫ్‌లో స‌మాజంలో అవినీతి, కోట్లు కూడ‌బెట్టుకున్న న‌ల్ల‌బాబుల‌పై సెటైర్లు ఉంటాయ‌ని తెలుస్తోంది. కామెడీ ట్రాక్ హిట్ అయితే, సినిమా మ‌రో రేంజ్‌కి వెళుతుంద‌ని, క‌ళ్యాణ‌రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం.

మొత్తంగా ఈ సినిమా క‌ళ్యాణ్‌రామ్ కేరీర్‌లో మరో బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమా అవుతుందని టాక్ వినిపిస్తోంది.

Related

  1. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!
  2. వెంకటేష్ పూరి కాంబినేషన్లో సినిమా!
  3. త‌మ‌న్నాతో చైతు క‌ళ్యాణం… స‌మంత‌తో కాదు
  4. క‌మెడియ‌న్‌ సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -