Saturday, April 20, 2024
- Advertisement -

ప్రేమించిన వ్యక్తి దూరమైతే కలిగే బాధ నాకు తెలుసు: రేణు దేశాయ్

- Advertisement -

పవన్ కళ్యాణ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు దేశాయ్.. ఇద్దరు పిల్లల తర్వాత కొన్ని అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రేణూ దేశాయ్ గతకొంత కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న రేణు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించారు.

అలా అభిమాలతో ముచ్చటిస్తూ.. వారు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పలు సూచనలు చేసారు. ప్రేమ విఫలమైతే సూసైడ్ చేసుకోవాలనే ఆలోచన చేసే వారికి తగు సూచనలు చేసింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రేణు స్పందిస్తూ… లవ్ ఫెయిల్ గురించి మాట్లాడుతు.. లవ్ ఫెయిల్ అయితే ఎంత బాధ ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ఎంతగానో ప్రేమించే వ్యక్తి మన పక్కన లేరనే విషయాన్ని తట్టుకోలేమని, మనం మోసపోయామని తెలిసినప్పుడు కలిగే బాధ అంతాఇంతా కాదని రేణు అన్నారు.

అయితే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం చాలా తప్పు. ముందు జీవితం, ప్రాణం గురించి ఆలోచించాలి. అవసరమైతే కౌన్సిలింగ్ తీసుకొని కుటుంబ సభ్యులు, స్నేహితుల సాయంతో ఆ బాధ నుండి బయటపడొచ్చు అంటూ రేణూ దేశాయ్ పలు సూచనలు చేసింది.

ప్రస్తుతం ఒక కొత్త సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న రేణూ దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టనున్నారు. మరోవైపు ‘ఆద్య’ అనే క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి వాయిస్ ఓవర్..!

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

రిచా సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -