ఆర్ఆర్ఆర్ లో చిరంజీవి వాయిస్ ఓవర్..!

- Advertisement -

దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా చేస్తుండటం ఈ సినిమాకి మరో స్పెషల్. బాహుబలి తర్వాత ఆ రెంజ్ సినిమానే మళ్లీ తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. ఇక ఈ సినిమాకి సాయి మాధవ్ బుర్ర మాటలు రాస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు నాడు ‘భీమ్ ఫర్ రామరాజు’ పేరుతో చరణ్ పాత్రను పరిచయం చేస్తూ ఓ టీజర్.. దసరా కానుకగా ఎన్టీఆర్ ‘రామరాజు ఫర్ భీమ్’ టీజర్ విడుదలయ్యింది. ఈ రెండు టీజర్లకు మంచి స్పందన వచ్చింది.

ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం అవుతున్నాడట. తెరపై కాకుండా తెరవెనుక నుండి ప్రేక్షకులను అలరించబోతున్నారట. అదే రామ్ చరణ్ రామరాజు, ఎన్టీఆర్ భీమ్, పాత్రలను పరిచయం చేస్తూ వాయిస్ ఓవర్ చిరంజీవి ఇస్తున్నట్టు సమాచారం.

- Advertisement -

దర్శకుడు రాజమౌళి చిరంజీవికి ఫోన్ చెసి అడగగా ఆలోచించ కుండా ఓప్పు కున్నారట. అయితే హిందీ వర్షన్ లో వాయిస్ ఓవర్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేయబోతున్నాడట. ఈ భారి బడ్జెట్ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా.. అజయ్ దేవ్ గణ్, శ్రియ, అలియా భట్ తదితరులు నటిస్తున్నారు.

ఆచార్య షూటింగులో రామ్ చరణ్ ఎప్పుడంటే..?

మహేష్ బాబు సీక్రెట్స్ బయటపెట్టిన మంజుల..

రిచా సినిమాలకు ఫుల్ స్టాప్ ఎందుకు పెట్టింది..?

‘రంగ్ దే’ టీమ్ అంత ధైర్యం చేస్తుందా?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...