Friday, April 26, 2024
- Advertisement -

తెరకెక్కనున్న కేసీఆర్ బయోపిక్

- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బయోపిక్ రాబోతోందా ? ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీయబోతున్నారా ? కే. చంద్రశేఖర్ రావు నిజ జీవితం ఆధారంగా తాను బయోపిక్ తీయబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ స్వయంగా ప్రకటించి సంచలనం రేపారు. ఇది కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందేనని స్పష్టం చేశారు.

ఎప్పుడూ ఏదో వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే రాంగోపాల్ వర్మ…తాజా ప్రకటనతో మళ్లీ హెడ్‌ లైన్స్ లో నిలిచారు. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ తన బుర్రలో ఉందని కూడా తెలిపారు. ఆర్జీవీ రూపొందించిన డేంజరస్ సినిమా ట్రైలర్ విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

బయోపిక్‌లు తీయడంతో రామ్ గోపాల్ వర్మది ప్రత్యేక శైలి. వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ తదితర సినిమాలను తెరకెక్కించారు. ఎప్పుడూ ఏదో వివాదాన్ని తట్టిలేపి నిత్యం వార్తల్లో ఉండే ఆర్జీవ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన కేసీఆర్ బయోపిక్ సినిమా తీస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

భారీగా రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేసిన కృతి శెట్టి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -