Tuesday, May 6, 2025
- Advertisement -

రోబో 2.0 ఫస్ట్ లుక్ ఎప్పుడో తెలుసా?

- Advertisement -

రికార్డులన్ని తిరగరాయడానికి రజనీ రోబో 2.0 తో రాబోతున్నాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టాప్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. 2010 లో వచ్చిన రోబో సినిమాకి ఇది సీక్వెల్. ఈ రోబో 2.0 లో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్నాడు. దాంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.

ఈ చిత్రంలో రజనీ వశీకరణ్ పాత్రలో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టనున్నారు. రజనీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. లైకా ప్రొడక్షన్ వాళ్లు 350 కోట్లతో ఈ చిత్రంను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని  సీక్వెన్స్ ని ఢిల్లీ లోని  స్టేడియంలో చిత్రీకరించారు. మానసిక ప్రశాంతత కోసం రెండు నెలల పాటు వర్జీనియా(అమెరికా)లో సచ్చిదానంద ఆశ్రమంలో గడిపి వచ్చిన రజనీ ఉత్సాహంగా రోబో 2.0 షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఏ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రంకు సంబంధించి ఒక్క ఫోటో కూడా ఇప్పటివరకు బయటక్యు రాలేదు. సూపర్ స్టార్ అభిమానులు రోబో 2.0 ఫస్ట్ లుక్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే రోబో 2.0 ఫస్ట్ లుక్ ని నవంబర్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొన్ని రోజుల్లో ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

Related

  1. హమ్మయ్య రజినీకాంత్ కదిలాడు
  2. రజనీ ఏ హీరోలను ఫాలో అవుతున్నారంటే?
  3. కబాలి పై రజనీ షాకింగ్ కామెంట్స్!
  4. రజనీ చిత్రంపై సంపూ సెటైర్ వేసాడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -