Friday, April 19, 2024
- Advertisement -

ఆర్​ఆర్​ఆర్​ మేకింగ్​ వీడియో వ్యూస్​ మామూలుగా లేవు..!

- Advertisement -

అగ్రనిర్మాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్​ఆర్​ఆర్​పై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. రూ. 450 కోట్ల భారీ బడ్జెట్​తో ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇక చారిత్రక కథాంశంతో తెరెకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లూరిగా రామ్​చరణ్​, కుమ్రం భీంగా తారక్​ కనిపించబోతున్న విషయం తెలిసిందే. అలియా భట్​, ఒలీవియా,అజయ్​ దేవగణ్​, శ్రీయ,సముద్ర ఖని వంటి నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

దీంతో ఈ మూవీకి పాన్​ ఇండియా లెవెల్​లో భారీ హైప్​ క్రియేట్​ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను విడుదల చేశారు. కేవలం 24 గంటల్లోనే 6 మిలియన్​ వ్యూస్​ సాధించి .. ఈ వీడియో రికార్డులు క్రియేట్​ చేసింది. దీంతో ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం విడుదలైతే తారక్​, రామ్​ చరణ్​ పాన్​ ఇండియా హీరోలుగా ఎదగనున్నారు. బాహుబలి హిట్​తో ప్రభాస్​ రేంజ్​ ఎక్కడికో వెళ్లిపోయింది.

ప్రస్తుతం ప్రభాస్ పాన్​ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్​ మూవీస్​ మాత్రమే చేస్తున్న విషయం తెలిసిందే. ఏకంగా ముంబైకి మకాం మార్చి వరస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తర్వాత తారక్​, చరణ్​ కూడా పాన్​ ఇండియా హీరోలుగా మారడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్​. కాగా ఆర్ఆర్ఆర్ దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల కానుంది.

Also Read

చైతూకు నో చెప్పిన బేబమ్మ..! రీజన్​ ఏమిటో?

అమీర్​ఖాన్​పై ఆరోపణలు.. స్పందించిన చిత్ర యూనిట్ ..!

అల్లు అర్హ బిగ్ స్క్రీన్ పై ఎంట్రీ కన్ఫర్మ్.. అల్లు అర్జున్ ఎమోషనల్ ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -