ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేది అప్పుడే..!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇందులో రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ రాధే శ్యామ్ ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది. ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాతో పాటు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమాలో నటిస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత తెలుగు డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్టుల్లో ప్రభాస్ నటించనున్నాడు. అయితే వీటితో పాటు ప్రభాస్ నటించిన కొత్త సినిమా పై భారీ అనౌన్స్మెంట్ సెప్టెంబర్లో రానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఆ వార్తలు నిజమేనని సమాచారం.

- Advertisement -

ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో మైత్రి మూవీ సంస్థ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాకు సంబంధించిన అఫిషియల్ అనౌన్స్మెంట్ సెప్టెంబర్ లో రానుంది. కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో రాధే శ్యామ్ విడుదల కానుండగా వచ్చే ఏడాది సలార్, ఆది పురుష్ సినిమాలు విడుదల కానున్నాయి.

Also Read

చేతినిండా సినిమాలుండే స్టార్ హీరో.. కాలేజ్ డేస్ లో ఏం చేసేవాడో తెలుసా..!

నవీన్​ పొలిశెట్టితో మూవీకి నో చెప్పిన స్వీటీ..!

రాక్షసుడు సీక్వెల్​లో విజయ్​ సేతుపతి?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -