Saturday, April 20, 2024
- Advertisement -

బాలీవుడ్ బ్యూటీతో లవ్‌లో సందీప్ కిషన్.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా ?

- Advertisement -

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లవ్‌లో పడ్డాడా ? బాలీవుడ్ భామతో పీకలోతు ప్రేమలో మునిగితేలుతున్నాడా ? అవునంటూ కొన్ని కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరా బాలీవుడ్ బ్యూటీ అనుకుంటున్నారా.. ? సందీప్ బాలీవుడ్‌ నటి సోనియా రాధేతో రిలేషన్‌లో ఉన్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిరువురు కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా కలుసుకున్నారు. తక్కువ కాలంలోనే వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారిందట.

అంతేకాదు, ముంబై వీధుల్లో ఈ ఇద్దరూ షికార్లు కొడుతున్నారని పుకార్లు వ్యాపిస్తున్నాయి. సోనియా ‘బ్రోకెన్‌ బట్‌ బ్యూటిఫుల్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. ఆమె నటించిన ‘తారా వర్సెస్‌ బిలాల్‌’ త్వరలో రిలీజ్‌ అవుతోంది. సోనియా మంచి నటి మాత్రమే కాదు, అద్భుతమైన డ్యాన్సర్‌ కూడా! గతంలో ఆమె ప్రొడక్షన్‌ డిజైనర్‌గానూ పని చేసింది.

అటు సందీప్‌ విషయానికి వస్తే అతడు చివరగా ‘గల్లీ రౌడీ’ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం పాన్‌ ఇండియా మూవీ ‘మైఖెల్‌’లో నటిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ కథనాలపై అటు సందీప్‌ కానీ, ఇటు సోనియా కానీ ఇంకా స్పందించలేదు.

మళ్లీ తెరపై చిరు విశ్వరూపం

మరోసారి రిపీట్ కాబోతున్న హిట్ పెయిర్

టాలీవుడ్ హీరోల కంటే వారి భార్యలే రిచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -