Thursday, May 2, 2024
- Advertisement -

సింగం 3 ఫ‌స్ట్ షో టాక్‌.. ఇదే!

- Advertisement -
singam 3 public talk

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం సింగం 3. నేడు ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో రిలీజ్ అయ్యింది. కానీ తెలుగులో మాత్రం రిలీజ్ అవుతుంది అనుకున్న సమయంలో ఏవో కారణాల వల్ల విడుదల వాయిదా పడింది. ఇక ఈ సినిమా కోలీవుడ్‌, ఓవ‌ర్సీస్‌లో ప్రీమియ‌ర్ షోలు పూర్తి చేసుకుంది.

త‌మిళ్, ఓవ‌ర్సీస్‌లో మాత్రం టాక్ వ‌చ్చేసింది. సింగం సీరిస్‌లో వ‌చ్చిన తొలి రెండు భాగాలు ఆక‌ట్టుకోవ‌డంతో పాటు ఆ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన హ‌రినే ఈ సినిమాకు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాపై ఎక్క‌డ లేని భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. అక్క‌డ ప్రీమియ‌ర్ షోల త‌ర్వాత సినిమా ప‌ర్వాలేద‌న్న టాక్ తెచ్చుకుంది. కోలీవుడ్ లో ఈ మూవీకి గుడ్ టాక్ వ‌స్తుంటే ఓవ‌ర్సీస్‌లో మాత్రం మిక్స్‌డ్ టాక్ వ‌స్తోంది. తొలి రెండు భాగాల్లాగే ఈ సినిమాలో డైరెక్టర్ హ‌రి ఇంటర్నేషనల్ మాఫియాని ఇంటరాగేట్ చేయడం వంటి సీన్లు అదిరిపోయాయని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో యాక్ష‌న్ డోస్ మరింత పెంచేసాడట. సూర్య‌తో పాటు మాస్ ప్రేక్ష‌కులు, బీ, సీ సెంట‌ర్ల ప్రేక్ష‌కులు సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తారంటున్నారు. అయితే క్లాస్‌, ఏ సెంట‌ర్ల ప్రేక్ష‌కులను  సింగం 3 ఎంత వ‌ర‌కు క‌నెక్ట్ అవుతుంద‌నేది ఇప్పుడే చెప్పలేం అనే టాక్ విపిస్తోంది. ఇక ఈ సినిమాలో సూర్య సరసన అనుష్క‌, శృతీహాస‌న్ లు హీరోయిన్స్ గా అదరగొట్టారట. ఫైన‌ల్‌గా కోలీవుడ్ లో సింగం 3కు గుడ్ టాక్ వ‌స్తే.. మిగిలిన ఏరియాల్లో పర్వాలేదు అనే టాక్ వస్తోంది. సింగం 3 కంప్లీట్ రివ్యూ కోసం ఆద్యా న్యూస్ చూస్తూనే ఉండండి.

Related

  1. అనుష్క పెళ్లి జరిగిపోయింది.. ఎవరితో తెలుసా..?
  2. అనుష్క‌కు స‌మంత‌తో గొడ‌వెందుకు ?
  3. అనుష్క పెళ్లిపై కొత్త న్యూస్.. ఎవరితో తెలుసా?
  4. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -