Sunday, May 19, 2024
- Advertisement -

సీక్రెట్స్ బయట పెట్టిన సమంత!

- Advertisement -
Samantha interesting things

ఇపుడు సౌత్ ఇండియాలో ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరోయిన్ సమంత.  టాప్ హీరోయిన్ గానే కాకుండా, తన మీద వస్తున్న కాంట్రవర్సీస్ తో కూడా ఎపుడు వార్తలో ఉంటుంది. ఇవన్ని పక్కకు పెడితే… గ్లామర్ డాల్ సమంత ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లోను చాలా చలాకీగా ఉంటుంది. ముద్దు ముద్దు మాటలతో అందరిని ఆటపట్టిస్తూ చాలా సరదాగా ఉంటుంది.

సెట్స్ లో సమంత ఉంటే ఆ సందడే వేరు అంటారు తనతో పని చేసిన వారు ఎవరైనా.. గత కొన్ని రోజులుగా స్టార్ హీరోయిన్ సమంత మరియు అక్కినేని వారసుడు నాగ చైతన్య మధ్య నడుస్తున్న ప్రేమ వ్యవహారం గురించి.. అలాగే వాళ్ళ వివాహం గురించి అంతటా చర్చలు జరిగాయి. జనతా గ్యారేజ్ తర్వాత తెలుగులో ఆమె మరే చిత్రాన్ని అంగీకరించలేదు. వచ్చే ఏడాది నాగచైతన్యతో ఈ సొగసరి పెళ్లికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇదిలావుండగా ఖాళీ సమయాల్లో చైతూ తాజా చిత్ర షూటింగ్ కు హాజరవుతోందట సమంత.

పెళ్లికి మరికొన్ని మాసాలు వుండటంతో ఈలోగా తెలుగులో కొన్ని సినిమాలకు ఓకే చెప్పే ఆలోచనతో వుందని తెలిసింది. ఈ వార్తలకు బలం చేకూర్చుతూ తాజాగా ఈ అమ్మడు తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. తెలుగులో ఇంట్రస్టింగ్ ప్రాజెక్ట్స్ కు ఒప్పుకున్నానని… వాటి వివరాలు బయటపెట్టాలని ఆత్రుతగా వుందని ఆ పోస్ట్ లో పేర్కొంది. దీంతో సమంత ఏ సినిమాల్ని చేయబోతుందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ యువ దర్శకుడు రూపొందించబోయే మహిళాప్రధాన చిత్రానికి ఆమె అంగీకరించిందని సమాచారం. ఇదిలావుండగా తమిళంలో మాత్రం సమంత రెండు చిత్రాలకు ఓకే చెప్పినట్లు తెలిసింది.

Related

  1. నాగ్ వల్లనే సమంతకు అన్యాయం జరిగిందా?
  2. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  3. సమంతకు నాగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?
  4. సమంత రిసెప్షన్ ఆ రెస్టారెంట్‍లోనట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -