Wednesday, May 22, 2024
- Advertisement -

నాగ్ వల్లనే సమంతకు అన్యాయం జరిగిందా?

- Advertisement -
No movie offers in Telugu for Samantha

అక్కినేని ఫ్యామిలీలో సమంతకు పోస్ట్ కన్ ఫర్మ్ అయిపోయింది. చైతూకి భార్యగా అక్కినేని కుటుంబంలోకి అడుగుపెట్టనుంది. అయితే ఇప్పుడు సమంత సినిమాల సంగతి ఏంటి? సమంత తెలుగు టాప్ హీరోలందరితో దాదాపు ఒకటికి రెండు,మూడు సినిమాలు వంతున చేసేసింది. ఇప్పుడు కొత్త అమ్మాయిల టైమ్ స్టార్ట్ అయింది. అందువల్ల సమంత అవకాశాలు తగ్గడం జస్ట్ నాచురల్. కానీ సమంత ఆలోచన అలా వున్నట్లు లేదు. నాగ్ కోడలు అని ఫిక్స్ కావడమే తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం అని ఆమె ఫీలవుతోంది.

తనకు ఎందుకు అవకాశాలు తగ్గాయో, తనకు తెలియంది కాదని, నాగ్ కోడలు అనగానే సినిమాల్లోకి తీసుకోవడానికి జంకేస్తారని అంటోందట సమంత. అంతే కాదు, ప్రస్తుతం చేతిలో వున్న అడ్వర్టైజ్ మెంట్ల అసైన్ మెంట్లు కూడా ఆగిపోయినా ఆశ్చర్యం లేదంటోంది. ట్విస్టేమిటంటే, ఇప్పటికే బోలెడు సినిమాలు చేసి, బోలెడు సంపాదించిన సమంత, సినిమాలు లేకపోయినా, అడ్వర్ టైజ్ మెంట్లు లేకపోయినా, తనకేం భయం లేదని, చైతన్య అన్నీ చూసుకుంటాడని అంటోంది.

ఏమాయె చేసావే సినిమా సమయంలో తన దగ్గర పెద్దగా డబ్బులు లేకపోతే, చైతన్యే అన్నీ చూసుకున్నాడని చెబుతోంది. ఏమాయ చేసావె టైంలో అంటే సమంత దగ్గర డబ్బులు లేకపోయి వుండొచ్చు. ఇన్ని సినిమాలు చేసాక కూడా లేవంటే ఎలా? అయినా ఇంత బాధపడడం ఎందుకు? చైతూకు చెబితే, అతని సినిమాలో, వేరే వాళ్ల సినిమాలకో సమంతను రికమెండ్ చేయడంటారా ?

Related

  1. సమంతని ఘోరంగా వేధించిన హీరో ఎవరో తెలుసా?
  2. సమంతకు నాగ్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు?
  3. సమంత రిసెప్షన్ ఆ రెస్టారెంట్‍లోనట!
  4. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -