Tuesday, April 30, 2024
- Advertisement -

మోడీ ఎఫెక్ట్ చరణ్ సినిమాపై బానే పడింది!

- Advertisement -
modi effect on dhruva

రామ్ చరణ్, రకుల్, సురెందర్ రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన ధృవ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన అన్నిచోట్లు ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. హిట్ కోసం ఎదురు చూస్తున్న రామ్ చరణ్ కి ఈ ధృవ మంచి హిట్ ఇచ్చింది. అయితే ఈ సినిమాని రెండు రాష్ట్రాల్లో అనేక థియటర్స్ లో విడుదల చేశారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ.. దేశంలో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా నోట్ల ర‌ద్దు ఎఫెక్ట్ ఎలా ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అన్ని పరిశ్రమలపై ఈ ఎఫెక్ట్ ఉంది. ఈ ఎఫెక్ట్ వల్ల చాలా సినిమాల క‌లెక్ష‌న్లు దెబ్బతిన్నాయి. చాలామంది నిర్మాత‌లు త‌మ సినిమాల‌ను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ ఎఫెక్ట్ ఇప్పటివరకు ఏ పెద్ద సినిమాపై పడలేదు. కానీ నోట్ల రద్దు తర్వాత రిలీజ్ అయిన మొదటి సినిమా ధృవనే.

ఈ సినిమా విడుదల అయిన తెలుగు రాష్ట్రాల్లో 40 శాతం థియేటర్లు మాత్రమే ఫుల్ అయ్యాయని తెలుస్తోంది. పెద్ద నోట్ల ఎఫెక్ట్ ఈ సినిమా పై బానే పడినట్లు అర్ధం అవుతోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి వ‌సూళ్లు వస్తాయో.. ఓపెనింగ్స్ పై దెబ్బ పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా మోడీ ఎఫెక్ట్ రామ్ చరణ్ సినిమాపై బాగానే పడినట్లు టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నారు.

Related

  1. రామ్ చరణ్ న్యూ 3 మూవీలు ఇవే!
  2. రామ్ చరణ్ తో అన‌సూయ డేటింగ్‌..!
  3. శర్వానంద్ రామ్ చరణ్ తోడల్లుడు కాబోతున్నాడు?
  4. మరొక ఆరెంజ్ తీస్తా అంటున్న రామ్ చరణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -