హీరోయిన్ సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడక్షన్స్, గుణ టీమ్ వర్క్స్ బ్యానర్స్‌పై దిల్‌రాజు, నీలిమ గుణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సమంత శాకుంతలగా కనిపిస్తే..మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ చైల్డ్ ఆర్టిస్ట్ గా భరతుడి పాత్రలో కనిపించబోతోంది. సమంత పుట్టిన రోజు సందర్భంగా ‘శాకుంతలం’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది సినిమా యూనిట్. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

సమంత లీడ్ రోల్ లో నటించిన తమిళ మల్టీస్టారర్ ‘కాతు వాక్కుల రెండు కాదల్’ ( కణ్మణి రాంబో ఖతీజా ) చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు యశోద సినిమాలోనూ సమంత నటిస్తోంది. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.
పుష్ప 2లో బాలీవుడ్ సీనియర్ హీరో