పుష్ప 2లో బాలీవుడ్ సీనియర్ హీరో

- Advertisement -

పుష్ప : ది రైజ్ పాన్ ఇండియా రేంజ్ లో క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏంటో తెలిసిందే. జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ కు మంచి పేరు తెచ్చింది. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే టాప్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కబోతోంది పుష్ప ది రూల్. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో స్వీక్వెల్ పై భారీ అంచనాలే ఉన్నాయి.

ఇక ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో ఓ లీడ్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ శెట్టి.. పుష్ప 2లో సీనియర్ పోలీసు ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. ఈ సినిమాలో నటించేందుకు ఆయన ఒకే చెప్పారట. భన్వర్ సింగ్ షెకావత్ పాత్రధారి ఫహద్ ఫాజిల్‌కు సునీల్ శెట్టి బాస్ గా కనిపించబోతున్నారు. పుష్పరాజ్ కు అడుగడుగునా అడ్డుతగిలే పాత్రలో భన్వర్ సింగ్ కనిపిస్తే..అల్లును రక్షించే పాత్రలో సునీల్ శెట్టి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అయితే ప్రీక్లైమాక్స్ లో సునీల్ శెట్టి ఇచ్చే ట్విస్ట్ హైలైట్ గా నిలవబోతోందని సమాచారం. ఇటీవల విడుదలై గని, అంతకు ముందు విడుదలైన మంచు విష్ణు ‘మోసగాళ్లు’ చిత్రాల్లో సునీల్ శెట్టి నటించారు. రజినీకాంత్ ‘దర్బార్’ లో కూడా విలన్ గా కనిపించారు. ఇక తాజాగా పుష్ప 2తో మంచి బ్రేక్ అందుకునేందుకు సునీల్ శెట్టి సిద్ధమవుతున్నారు.

ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆలియా

ఆచార్య సినిమా నుంచి కాజల్ తొలగింపు.. ఎందుకంటే..?

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -