బాలీవుడ్‌పై కన్నేసిన సమంత

దక్షిణాదిని షేక్ చేసి.. వరుస అవకాశాలతో దూకుడు మీదున్న నటి సమంత.. బాలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైపోతోంది. ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్టులను దక్కించుకుందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్ దర్శకుడు ఆదిత్య ధర్ నెక్ట్‌ మూవీ ‘ద ఇమ్మోర్టాల్ అశ్వత్థామలో సామ్ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ఈ మూవీలో హీరోయిన్‌గా ముందు సారా అలీ ఖాన్ అనుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే సమంతనే ఎంపిక చేసినట్లు బీ టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 2023 ప్రారంభంలో ఇమ్మోర్టాల్ అశ్వత్థామ సెట్స్‌పై‌కి వెళ్లనుంది.

ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా సమంత మరో ప్రాజెక్టులో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాడ్‌డక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’, ‘యశోద’, ‘ఖుషి’ సినిమాలతో బిజీబిజీగా ఉంది.

Also Read

రీ ఎంట్రీ ఇస్తున్న కలర్స్ స్వాతి

గూఢచారిగా వరుణ్ తేజ్

మెగాస్టార్ మూవీలో విలన్ అతడే..

Related Articles

Most Populer

Recent Posts