ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్న ఆలియా

ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ లో ఇది 30వ మూవీ. జనతా గ్యారేజీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న రెండో మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ ఈ సినిమాలో నటిస్తోందంటూ ప్రచారం జరిగింది.

తాజాగా ఆలియా భట్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఇటీవలే రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకున్న ఆలియా.. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. దాంతో ఆలియా స్థానంలో ఈ మూవీలో కన్నడ బ్యూటీ రష్మిక మందణ్ణ భర్తీ చేయబోతోందంటూ టాలీవుడ్ లో టాక్. పుష్ప పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడంతో రష్మికకు వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి.

తమిళ్ హీరో విజయ్ తో త్వరలో ఓ చిత్రం చేయబోతున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ 30వ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రష్మిక నటిస్తోందా లేదా అన్నదానిపై త్వరలో అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.

చిరు 154వ చిత్రానికి రంగం సిద్ధం

ఆ ఛాన్స్ కోసం కేజీఎఫ్‌ బ్యూటీ నిరీక్షణ

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

Related Articles

Most Populer

Recent Posts