Thursday, May 16, 2024
- Advertisement -

సాఫ్ట్ వేర్ సుధీర్ మూవీ రివ్యూ..!

- Advertisement -

జబర్దస్త్ ద్వారా మంచి కమెడీయన్ గా పేరు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ హీరోగా పరిచయం అవుతూ చేసిన చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ధన్యా బాలకృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించారు. ఈ రోజే రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ : చందు(సుడిగాలి సుధీర్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తాడు. అదే ఆఫీస్ లో పని చేసే స్వాతి (ధాన్యా బాలకృష్ణ)తో ప్రేమలో పడుతాడు. ఇద్దరి ఎంగేజ్మెంట్ జరిగిన అనంతరం.. సెంటిమెంట్స్ ఎక్కువగా ఫాలో అయ్యే స్వాతి సలహా మేరకు ఓ స్వామిజీని వీరు కొన్ని కారణాలచేత కలుస్తారు. ఐతే ఆ స్వామిజీ చందుని పావుగా వాడుకొని సుధీర్ తండ్రి (సాయాజీ షిండే) పనిచేసే మంత్రి (శివ ప్రసాద్) దగ్గర నుండి వెయ్యి కోట్లు కొట్టేస్తారు. దాంతో తన డబ్బు తనకు కావాలని మంత్రి చందుని బెదిరిస్తాడు. మరి చందు ఆ డబ్బులు తీసుకొచ్చడా ? ఆ స్వామిజీని ఏ చేశాడు ? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

తెరపైన హీరోగా సుధీర్ ఎనర్జీతో కనిపించాడు. ప్రధానంగా డాన్సులు ఇరగదీశాడు. అమాయకుడిగా బాగా ఆకట్టుకున్నాడు. కామెడీ టైమింగ్ కుడా బాగుంది. హీరోయిన్ ధన్యా బాలకృష్ణ రెండు భిన్న షేడ్స్ కలిగిన పాత్రను చక్కగా పోషించింది. పాటలలో ఆమె గ్లామర్ యూత్ కి కిక్కెక్కించేదిలా ఉంది. సినిమాలో వచ్చే రెండు ట్విస్టులు బాగున్నాయి. మిగిత నటినటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

ఓ సోసియో ఫాంటసీ చూస్తున్నం అని ఫీలైన ప్రేక్షకుడికి విరామం తర్వాత ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ అని అర్దం అవుతుంది. దాంతో ఆడియన్స్ కథ నుంచి డైవర్ట్ అవుతారు. అన్ని పంచులు తెరపై పేలలేదు. కామెడీ కోసం వచ్చే ప్రేక్షకులకు నిరాశ మిగులుతోంది. స్క్రీన్ ప్లే ఆసక్తికరంగా లేకపోవడం మైనస్.

మొత్తంగా : ఫస్ట్ ఆఫ్ బానే ఉన్న సెకాండాఫ్ కి వచ్చేసరికి ప్రేక్షకుడి ఇంట్రెస్ట్ పక్కదారి పడుతుంది. కామెడీ, సుధీర్ డాన్సులు, హీరోయిన్ అందాలు ప్రేక్షకులను అలరిస్తాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -