Friday, May 17, 2024
- Advertisement -

సోగ్గాడే చిన్ని నాయన రివ్యూ

- Advertisement -

సాధారణంగా పెద్ద హీరోల సినిమాలూ, పెద్ద సినిమాలూ విడుదల సమయంలో తన సినిమా విడుదల చెయ్యడానికి హీరో నాగార్జున ఎప్పుడూ సంసయిస్తారు. ఒకవేళ తన సినిమా రెవెన్యూ పరంగా కానీ థియేటర్ ల పరంగా గానీ ఇబ్బందులు ఎదురుకొంటుంది అనేది ఆయన లెక్క కావచ్చు.

అలాంటిది సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు వస్తున్న పరిస్థితి లో నాగార్జున సొంత ప్రొడక్షన్ లో వచ్చిన ‘సోగ్గడే చిన్ని నాయన’ సినిమా ఇప్పుడు సంక్రాంతి బరిలో నిలవడం ఆశ్చర్యం అనిపిస్తోంది. కొత్త డైరెక్టర్ తో తీసిన ప్రయత్నాన్ని నాగ్ ఎంతవరకూ సక్సెస్ చేసారో చూద్దాం రండి..

 

శివపురం అనే గ్రామంలో ఉన్న సోగ్గాడే మన బంగార్రాజు(నాగార్జున-ఫాదర్).. చాలా అల్లరి చేస్తూ, అమ్మాయిలతో సరదాగా ఉండే బంగార్రాజుకి తన భార్య సత్యవతి(రమ్యకృష్ణ) అన్నా, కుటుంబం అన్నా చాలా ప్రేమ. బంగార్రాజు చనిపోయిన తర్వాత సత్యవతి బంగార్రాజులా తన కొడుకు ఉండకూడదని తనని ఊరికి దూరంగా పెట్టి డాక్టర్ చదివిస్తుంది.. తనే రామ్మోహన్(నాగార్జున – కొడుకు). ఊరికి దూరంగా పెరగడం వలన రామ్మోహన్ కి తను చదివిన విషయాలు తప్ప మిగతా ఏమీ తెలియని ఒక ముద్దపప్పులా పెరుగుతాడు. రామ్మోహన్ కి భార్య సీత(లావణ్య త్రిపాటి)కి మధ్య ఇబ్బందులు రావడంతో ఇద్దరూ శివపురం వస్తారు. ఆ ఊరి శివాలయానికి – బంగార్రాజు ఫ్యామిలీకి ఓ సంబంధం ఉంటుంది. ఆ గుడికి సంబదించిన ఓ పనిని పూర్తి చేయకుండానే బంగార్రాజు చనిపోతాడు. ఆ పనిని రామ్మోహన్ చేయాలి కానీ తను అమయాకుడు కావడం వలన సృష్టి లయకారుడైన శివుడు బంగార్రాజుని ఆత్మగా తను ఫినిష్ చేయాల్సిన పని కోసం భూమి మీదకి వస్తాడు. అలా వచ్చిన బంగార్రాజు ఏం చేసాడు? తన కొడుకు రామ్మోహన్ ని చివరికి ఎలా మార్చాడు? ముఖ్యంగా ఆ గుడికి – బంగార్రాజు ఫ్యామిలీకి ఉన్న సంబంధం ఏమిటి? అలాగే బంగార్రాజు పూర్తి చేయకుండా వదిలేసిన పనేంటి ? ఇలాంటివి అన్నీ వెండి తెర మీద చూడాల్సిందే . ఈ సినిమాకి అతిపెద్ద పాజిటివ్ పాయింట్ ‘నాగార్జున’ రెండు పాత్రల్లో బంగారు రాజు గా – రామ్మోహన్ గా అసలు దున్నేసారు అని చెప్పాలి. బంగారు రాజు అమ్మాయిలను బుట్టలో వేసుకునే మన్మధుడు కాగా ఆయన కొడుకు రామ్మోహన్ ఏమీ తెలియని అమాయకుడు. ఈ రెండు పాత్రల మధ్యనా వేరియేషన్ అదిరిపోయింది. ఆయన తరవాత రమ్యకృష్ణ పాత్రకి ఎక్కువ మార్కులు పడ్డాయి.  క్లాస్ విలన్ గా సంపత రాజ్ మెప్పించాడు. బ్రహ్మానందం, రఘుబాబు, వెన్నెల కిషోర్, సప్తగిరి, పోసాని కృష్ణమురళిలు అక్కడక్కడా తమ మార్క్ కామెడీని చూపించారు. అనుష్క గెస్ట్ పాత్రలో కనిపించింది. రెండు పాత్రలకీ డిఫరెన్స్ చూపించడంలో సాంకేతిక బృందం కూడా సక్సెస్ అయ్యింది. రొమాంటిక్ సీన్ లూ, కామెడీ అన్నీ బాగా కుదిరాయి. సత్యానంద్ రాసిన స్క్రీన్ ప్లే అదిరింది. 

 

 

నెగెటివ్ పాయింట్స్ 

సినిమా నారేషన్ చాలా స్లో గా సాగడం పెద్ద మైనస్ , స్ట్రాంగ్ విలనిజం లేకపోవడం కూడా కాస్త ఇబ్బంది అనిపించింది. స్క్రీన్ ప్లే కొత్తగా ఉన్నా టేకింగ్  రొటీన్ గా సాగింది. ఫామిలీ అంశాల మీద బాగా దృష్టి పెట్టిన డైరెక్టర్ చాలా చోట్ల ఇంపార్టెంట్ లాజిక్ లు మిస్ అయ్యాడు. మ్యూజిక్ , పాటలు రావాల్సిన తీరూ, సమయం కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది అనిపిస్తుంది. కొన్ని సీన్లు పాత సినిమాల నుంచి చూస్తున్న‌వే ఉండ‌డం [పెద్ద వీక్ నెస్ . ప్లాష్ బ్యాక్ స్టోరీ ఇంకా స్ర్టాంగ్‌గా డిజేన్ చేసుకోక‌వడం లో కూడా తడబడ్డారు.

 

 

మొత్తంగా ::

ఒక పక్క నాన్నకు ప్రేమతో హిట్ కొట్టగా , ఎక్స్ ప్రెస్ రాజా మంచి టాక్ తెచ్చుకోగా సోగ్గాడు గా నాగార్జున ఫామిలీ లని కట్టి పడేస్తారు అనడం లో ఎలాంటి సంశయం లేదు. సాగదీసిన సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్ లని పక్కన పెడితే ఈ సంక్రాంతికి మూడవ హిట్ గా ఈ సినిమా ఖచ్చితంగా నిలుస్తుంది అని చెప్పచ్చు,. అన్ని వ‌ర్గాల వారు క్లాస్‌, మాస్‌, ఫ్యామిలీ, యూత్ ఇలా అంద‌రూ సినిమాకు క‌నెక్ట్ అవుతారు. 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -