Saturday, April 20, 2024
- Advertisement -

FLASH : నటుడు సోనూ సూద్ కి కరోనా పాజిటీవ్

- Advertisement -

లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది వలస కూలీలకు అండగా నిలిచి నేనున్నా అంటూ ముందుకు సాగారు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. ఆయన చేసిన సేవలకు ఎంతో మంది ప్రశంసలు కురిపించారు. అపద్బాందువుడు, దేవుడిగా సోనూ సూద్ సేవలు పొందిన వారు తెగ పొగిడారు. అలా ఎంతో మందికి సేవలు అందించిన సోనూ సూద్ ని కూడా కరోనా వదలలేదు. తాజాగా నటుడు సోనూ సూద్ కి కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది.

ఈ విషయాన్ని సోనూ స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.సురక్షిత చర్యల్లో భాగంగా ఇప్పటికే క్వారంటైన్ లో ఉన్నానని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు పరీక్షలు చేసుసోవాలని సూచించారు.

అంతే కాదు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని.. త్వరలోనే సురక్షితంగా బయటకు వస్తానని అన్నారు. తన గురించి ఆందోళన చెందవొద్దని అభిమానులను కోరారు. ప్రస్తుతం సోనూ సూద్ ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే.

పోలింగ్ లో ఆయన ఓటు.. తిరుపతికి తక్కువే ఓటింగ్..!

దేవినేని ఉమకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మళ్ళీ నోటీసులు..!

వైఎస్ షర్మిల అనుచరుల్లో చాల మంది కి కరోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -