Thursday, April 25, 2024
- Advertisement -

వైఎస్ షర్మిల అనుచరుల్లో చాల మంది కి కరోనా..!

- Advertisement -

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలంటూ వైఎస్‌ షర్మిల చేపట్టిన ‘ఉద్యోగ దీక్ష’ మూడో రోజుకు చేరుకుంది. శుక్రవారం దీక్షా శిబిరానికి షర్మిల తల్లి విజయమ్మ వచ్చి పరామర్శించారు. ప్రాణం పోయినా మంచినీళ్లు ముట్టనని, 72 గంటల దీక్షను కొనసాగిస్తానని షర్మిల తెలిపారు. నిరాశతో ఆత్మహత్యలకు పాల్పడొద్దని నిరుద్యోగులను కోరారు.

గురువారం సాయంత్రం ఇందిరాపార్క్‌ వద్ద దీక్షను భగ్నం చేసి లోటస్‌పాండ్‌కు తరలిస్తున్న క్రమంలో షర్మిల ఎడమ చేతికి గాయం కాగా వైద్యులు పరీక్షించి పట్టీ వేశారు. ఆమె చక్కెర స్థాయిని, రక్తపోటునూ పరీక్షించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఆమె చేతికి నల్ల రిబ్బను కట్టుకున్నారు.

టస్‌పాండ్‌ వద్దకు నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కళాకారులతో కళాజాత ఏర్పాటు చేశారు. బంజారాహిల్స్‌ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. షర్మిల కార్యక్రమాల్లో క్రియాశీలకంగా ఉన్న కొండా రాఘవరెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

ఓటర్లు సిద్ధం.. కానీ ఈవీఎంల తీరు సందేహం..!

నైట్ కర్ఫ్యూ ఉన్నా.. నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది.. అడ్డంగా బుక్ అయ్యింది!

పవన్ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చింది: ప్రకాష్ రాజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -