ఆ ఊరి వాళ్ళు ఓటు వెయ్యరంట.. ఎందుకంటే..!

- Advertisement -

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం ఊరందూరు, జింగిల్​పాలెం గ్రామాల్లో.. తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికలను గ్రామస్తులు బహిష్కరించారు. పోలింగ్ ప్రారంభమైనా ఓటు వేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తమ పంచాయతీలను శ్రీకాళహస్తి పురపాలక సంఘంలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ.. గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు.

ఓటు వేసేందుకు ఎవరూ వెళ్లొద్దంటూ రెండు రోజుల క్రితమే ఊరందూరు గ్రామంలో దండోరా వేయించారు. ఆ మేరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎవరూ ముందుకు రాని కారణంగా.. పోలింగ్ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. జింగిల్‌పాలెం గ్రామస్థులను అధికారులు బుజ్జగిస్తున్నా.. వారు ఓట్లు వేయటానికి సుముఖత చూపటం లేదు.

- Advertisement -

ఓటర్లు సిద్ధం.. కానీ ఈవీఎంల తీరు సందేహం..!

పవన్ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చింది: ప్రకాష్ రాజ్

జనసేన కి ‘గాజుగ్లాసు’ గుర్తు క్యాన్సిల్..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -