Friday, April 19, 2024
- Advertisement -

సజ్జల రామకృష్ణారెడ్డి వివరణ..మంత్రి ఇల్లు అక్కడే ఉంది..!

- Advertisement -

తిరుపతి ఉప ఎన్నికలో ఎక్కడా చిన్నపాటి ఘటనలు కూడా లేకుండా ప్రశాంతంగా జరుగుతున్నాయని ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. టిడిపి నే లేనిపోని గొడవ చేస్తోందని విమర్శించారు. శ్రీవారి దర్శనానికి బస్సుల్లో వస్తే దానిపై కూడా గొడవ చేస్తారా..? అని ప్రశ్నించారు. తిరుపతి తప్ప మిగిలిన చోట్ల ఇలాటి ఘటనలు ఎందుకు లేవని వ్యాఖ్యానించారు. కొవిడ్ కారణంగా పోలింగ్ శాతం తగ్గి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.

మంత్రి పెద్దిరెడ్డి అక్కడెందుకున్నారని చంద్రబాబు అడగటంపై సజ్జల స్పందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అక్కడ ఇల్లు ఉందని తెలియదా..? అని నిలదీశారు. తిరుపతిలో అన్ని పార్టీల ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం లేదని.. కేంద్ర పారా మిలటరీ బలగాలు, వెబ్ కెమెరాలు ఉన్నాయని తెలిపారు.

ఇవన్నీ ఉన్నా దొంగ ఓట్లు వేయగలరా?..అని ప్రశ్నించారు. తిరుపతిలో 10 సార్లు ఉపఎన్నికలు పెట్టినా వైసిపికే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రీపోలింగ్‌కు అనుమతిస్తే ఈసీ తనకు తాను అవమానించుకున్నట్లేనని వ్యాఖ్యానించారు.

పోలింగ్ లో ఆయన ఓటు.. తిరుపతికి తక్కువే ఓటింగ్..!

దేవినేని ఉమకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మళ్ళీ నోటీసులు..!

వైఎస్ షర్మిల అనుచరుల్లో చాల మంది కి కరోనా..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -