పోలింగ్ లో ఆయన ఓటు.. తిరుపతికి తక్కువే ఓటింగ్..!

- Advertisement -

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మన్నసముద్రంలోని పోలింగ్​ కేంద్రంలో వైసిపి ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామ దేవతలకు పూజలు నిర్వహించిన అనంతరం గురుమూర్తి దంపతులు ఓటు వేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్​ కేంద్రం వద్ద క్యూలో నిలబడి తమ బాధ్యతను నిర్వర్తించారు. ప్రజలంతా తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు.

- Advertisement -

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్​ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి పోలింగ్ 17.80 శాతంగా నమోదైంది. అత్యధికంగా సర్వేపల్లి నియోజకవర్గంలో 21.35 శాతం నమోదు కాగా.. అత్యల్పంగా గూడూరులో 3.49 శాతంగా ఉంది.

ఓటర్లు సిద్ధం.. కానీ ఈవీఎంల తీరు సందేహం..!

పవన్ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చింది: ప్రకాష్ రాజ్

జనసేన కి ‘గాజుగ్లాసు’ గుర్తు క్యాన్సిల్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -