Thursday, March 28, 2024
- Advertisement -

దేవినేని ఉమకు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. మళ్ళీ నోటీసులు..!

- Advertisement -

మాజీ మంత్రి దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గొల్లపూడిలోని ఉమ నివాసానికి రెండోసారి నోటీసులు అంటించారు. ఈనెల 19న కర్నూలు సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. 15న దేవినేనికి మొదటి నోటీసు ఇచ్చారు. అప్పుడు దేవినేని ఉమ.. తనకు 10 రోజులు సమయం కోరారు.

సీఎం జగన్‌ మాటలను వక్రీకరించారన్న న్యాయవాది ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో మార్ఫింగ్‌ చేసిన జగన్‌ వీడియోలు ప్రదర్శించారని అభియోగం నమోదు చేశారు. ప్రెస్‌మీట్‌లో ప్రదర్శించిన వీడియోలు కూడా తీసుకురావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 464, 465, 468, 469, 470, 471, 505, 1200 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఓటర్లు సిద్ధం.. కానీ ఈవీఎంల తీరు సందేహం..!

నైట్ కర్ఫ్యూ ఉన్నా.. నడిరోడ్డుపై డ్యాన్స్ చేసింది.. అడ్డంగా బుక్ అయ్యింది!

పవన్ కళ్యాణ్‌లో చాలా మార్పు వచ్చింది: ప్రకాష్ రాజ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -