Wednesday, April 24, 2024
- Advertisement -

భానుప్రియకు లవ్ ప్రపోజ్ చేసిన టాప్ డైరెక్ట‌ర్‌

- Advertisement -
star director prapose to bhanupriya

టాలీవుడ్‌లో ఒక్కప్పుడు టాప్ హీరోయిన్స్ లో భానుప్రియ ఒక‌రు. అప్పట్లో అందరి హీరోలతో నటించిన భానుప్రియ.. ఇప్పుడు త‌ల్లి, వ‌దిన పాత్ర‌ల‌తో కనిపిస్తోంది. ఆమె కేరీర్‌లో ఎన్నో హిట్, సూప‌ర్ హిట్ చిత్రాలు ఉన్నాయి. కాస్త గ్యాప్ తీసుకున్న భానుప్రియ ప్ర‌స్తుతం తెలుగు సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ బుల్లితెర మీద కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే అప్ప‌ట్లో ఆమె టాప్ హీరోయిన్‌గా కొన‌సాగుతున్న‌ప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఆమెకు ప్ర‌పోజ్ చేశాడ‌ట‌.

అంతేకాకుండా ఆమెను పెళ్లి చేసుకుంటాన‌ని కూడా అడిగాడ‌ట‌. భానుప్రియ తాజా ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని చెప్పింది. ఇంతకీ భానుప్రియకు లవ్ ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా .. సీనియర్ దర్శకుడు వంశీ. అప్పట్లో వంశీ సినిమా అంటే ప్రేక్షకులకు అదో క్రేజ్? భానుప్రియ టాప్ హీరోయిన్ గా మారడంలో వంశీ సినిమాలు కీలకంగా ఉన్నాయి. ఆమెను ఎంతో ప్రత్యేకంగా, అందంగా చూపించేవాడు..

వంశీ, భానుప్రియ‌ కాంబినేషన్ లో వచ్చిన “సితార”, ”అన్వేషణ”, ”ఆలాపన” లాంటి సినిమాల్లో భానుప్రియ కొత్తగా కనిపిస్తుంది. ఆ సినిమాలు తీస్తున్నప్పుడే భానుప్రియ అంటే వంశీకి ఇష్టం ఏర్ప‌డి ఆమెకు ప్ర‌పోజ్ చేయ‌డంతో పాటు పెళ్లి చేసుకుంటాన‌ని అన్నాడ‌ట‌. అయితే వీరి పెళ్లికి భానుప్రియ త‌ల్లి నో చెప్పింద‌ట‌. అప్పటికే వంశీ కి పెళ్ళయిపోయిందట.

Related

పబ్లిగ్గా లవ్ గురించి చెప్పిన సమంత!

హీరోయిన్ పై అత్యాచారం చేసిన డైరెక్టర్

డైరెక్టర్ చేతిలో అఖిల్ కి ఘోర అవ‌మానం!

స్టార్ డైరెక్టర్ తో రాత్రంతా గడిపిన హాట్ యాంకర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -