Saturday, May 4, 2024
- Advertisement -

పబ్లిగ్గా లవ్ గురించి చెప్పిన సమంత!

- Advertisement -

నాగ చైతన్య, సమంత ప్రేమించుకుంటున్నారు అని త్వరలోనే వీరు పెళ్లి కూడ చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు కలిసి తిరుగుతూ మీడియాకు చాలా సార్లు దొరికి పోయారు కూడా. అయితే ఈ లవ్ విషయంపై మాత్రం నాగ చైతన్యగానీ, ఇటు సమంత గానీ ఎలాంటీ క్లారీటి ఇవ్వడం లేదు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత ప్రేమలో పడ్డ విషయం వెల్లడించింది గానీ… నాగ చైతన్య పేరు మాత్రం బయట పెట్టలేదు. తాజా ఆమె తన ప్రేమికుడు, పెళ్లాడబోయే వ్యక్తి అతడే అని పబ్లిక్ అందరికీ తెలిసేలా చేసింది. నాగ చైతన్య నటించిన ‘ప్రేమమ్’ సినిమా పోస్టర్‌ను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. నాగ చైతన్యపై తన ప్రేమను అక్షరాల రూపంలో కాకండా లవ్ సింబల్స్ రూపంలో వ్యక్త పరిచింది.

మూడు లవ్ సింబల్స్ ను యాడ్ చేస్తూ ఆ పోస్టు షేర్ చేసింది. సాధారణంగా సమంత తన ట్విట్టర్లో ఇలాంటి పోస్టులు చేయదు. ఇపుడు సంథింగ్ స్పెషల్ గా ఇలా చేయడం ద్వారా అతనిపై తనకు ఉన్న ప్రేమను పబ్లిక్‌గా ప్రకటించినట్లయింది. ఇక ఇటివకే వీరిద్దరు బెల్జియం వెళ్లి జాలీగా ఎంజాయ్ చేసి వచ్చారు. ఇక సమంత-చైతూ ప్రేమ వివాహం పై నాగార్జున కూడా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి డేట్ కూడా ఖారరు కానుంది. 

Related

  1. నాకు చిన్నప్పటి నుంచే అలవాటు ఉంది – సమంత
  2. సమంత -చైతన్య ఎవరికి పార్టీ ఇచ్చారంటే?
  3. చైతూ -సమంత ఎక్కడ ఎంజాయ్ చేస్తున్నారంటే?
  4. సమంతకు గట్టి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -