Thursday, April 25, 2024
- Advertisement -

ద్రాక్షగుత్తి రూ. 7లక్షలు..! అంత స్పెషల్​ ఏమిటంటే..!

- Advertisement -

ద్రాక్షపండ్లు ఇష్టపడని వారు ఉండరు. ఈ పండులో అనేక పోషక విలువలు ఉంటాయి. దీంతో అంతా ఈపండ్లను తీసుకుంటారు. ఇదిలా ఉంటే మనదేశంలో ద్రాక్ష పండ్లు కిలోకు రూ. 50 నుంచి రూ.70 వరకు ఉంటాయి. మహా అయితే రూ. 100 వరకు ఉండొచ్చు. జపాన్‌ దేశంలో ఓ రకం ద్రాక్ష పండ్లు ఒక గుత్తికి 11 వేల డాలర్లు పలుకుతున్నాయి. అంటే మన ఇండియన్​ కరెన్సీలో 7.5 లక్షలు. ఇంతకీ ఆ ద్రాక్షపండ్లకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? అవి ఎందుకంత ధర పలుకుతున్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం..

జపాన్​లో రుబీ రోమన్ గ్రేప్స్‌గా(Ruby Roman grapes) పిలిచే ఓ అరుదైన ద్రాక్ష రకం ఉంది. ఈ రకం కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే సాగుచేతారు. జపాన్‌లోని ఇషికావా దీవిలో మాత్రమే ఈ ద్రాక్షతోటలను పెంచుతారు. ఈ ద్రాక్షపండ్లకు చాలా డిమాండ్​ ఉంటుంది. దీంతో వీటిని వేలానికి పెడతారు. అలా ఈ ఏడాది ఈ ద్రాక్ష గుత్తి రూ. 7.5 లక్షల ధర పలికింది.

జపాన్‌కు చెందిన ఓ కంపెనీ ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకుంది. ఒక్కో పండు బరువు 20గ్రాములపైనే ఉంది. అయితే ఈ ద్రాక్ష పండ్లు సాధారణ ద్రాక్షలకంటే చాలా రెట్టింపు స్థాయిలో తియ్యదనం ఉంటుందని రైతులు చెబుతున్నారు. కొన్ని హోటలు తమ వద్దకు వచ్చే విశిష్ఠ అతిథులుకు వీటిని ఇస్తుంటారు.ఇక చాలా మంది తమకు ఇష్టమైన వ్యక్తులకు వీటిని బహుమతిగా ఇస్తారు.

Also Read

కేరళలో జికా వైరస్​.. దోమతో వ్యాప్తి.. టెన్షన్​.. టెన్షన్

తిరుమలకు శుభలేఖ పంపితే.. టీటీడీ బహుమానాలు..!

ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే ‘సౌత్ ఇండస్ట్రీయే’..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -