19న థియేటర్లలోకి ‘రాజ రాజ చోర’

- Advertisement -

టాలీవుడ్లో వరుసగా విభిన్న చిత్రాలను చేస్తూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు యువ హీరో శ్రీ విష్ణు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు ఏదో ఒక కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు భావిస్తుంటారు. తాజాగా ఆయన నటించిన బ్రోచేవారెవరురా.. సినిమా మంచి విజయం సాధించింది. అప్పటివరకు సీరియస్ సినిమాలు చేస్తూ వచ్చిన శ్రీ విష్ణు క్రైమ్ కామెడీ నేపథ్యంలో చేసిన సినిమా అందరినీ ఆకట్టుకుంది.

మళ్లీ అదే నేపథ్యంలో శ్రీ విష్ణు రాజ రాజ చోర అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా షూటింగ్ కొన్ని నెలల కిందటే పూర్తయినప్పటికీ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా విడుదలకు నోచుకోలేదు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఈ చిత్రాన్ని నిర్మించిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్,అభిషేక్ అగర్వాల్ తెలియజేశారు.

ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్, సునయన హీరోయిన్లుగా నటించారు. హసిత్ గోలీ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన రాజరాజ చోర పోస్టర్లు, టీజర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఎంత మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో టాలీవుడ్ లో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. మళ్లీ మునుపటి సందడి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -