Thursday, March 28, 2024
- Advertisement -

కాస్కోండి.. మొదలైంది సినిమాల జాతర..!

- Advertisement -

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏప్రిల్ ద్వితీయార్థంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూత పడ్డాయి. అప్పటి నుంచి జూలై ఆఖరు వరకు థియేటర్లు మూసే ఉన్నాయి. ఇటీవల థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో రారోనన్న సందేహంతో సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ చాలామంది నిర్మాతలు రిలీజ్ చేయలేదు. ఆ తర్వాత మెల్ల మెల్లగా లో చిన్న బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలవడం మొదలైంది.

గత శుక్రవారం నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. అందులో కిరణ్ హీరోగా నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దీంతో నిర్మాతలు కాస్త ఊపిరి తీసుకున్నారు. సినిమాలు విడుదల చేస్తే ఆశించిన స్థాయిలో కలెక్షన్లు వస్తాయనే నమ్మకం వచ్చింది. దీంతో షూటింగ్ ముగిసి అంతా సిద్ధమైన సినిమాలను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ఈ ఒక్క వారమే థియేటర్లలో తొమ్మిది సినిమాలు విడుదల అవుతున్నాయి. వాటిలో చాలా సినిమాలు లో బడ్జెట్ తో తెరకెక్కినవే అయినప్పటికీ దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న పాగల్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ లు హీరోలు గా నటిస్తున్న ఒరేయ్ బామర్ది డబ్బింగ్ సినిమా కూడా విడుదల అవుతోంది. శుక్రవారం ఏడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో పూర్ణ నటించిన సుందరి, బ్రాందీ డైరీస్, సలాం నమస్తే,చైతన్య, రావే నా చెలియా, ఒరేయ్ బామర్ది, ది కంజూరింగ్ 3 ఉన్నాయి. శనివారం విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న పాగల్ సినిమా విడుదలవుతోంది. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రైతన్న సినిమా కూడా శనివారమే వస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా తొమ్మిది సినిమాలు విడుదల అవుతుండడంతో బాక్సాఫీస్ వద్ద సందడి నెలకొంది.

Also Read

నంబర్ వన్, టూ ఐఏఎస్ టాపర్లకు విడాకులు మంజూరు..!

దేశంలోనే ఐఏఎస్ టాపర్స్.. ప్రేమించి మతాంతర వివాహం.. చివరికిలా..!

బిగ్ బాస్ లోకి సుడిగాలి సుధీర్.. రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాకే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -