Friday, March 29, 2024
- Advertisement -

దేశంలోనే ఐఏఎస్ టాపర్స్.. ప్రేమించి మతాంతర వివాహం.. చివరికిలా..!

- Advertisement -

ఐదేళ్ల కిందట ఐఏఎస్ లో టాపర్లుగా నిలిచి నెంబర్ వన్, నెంబర్ టూ ర్యాంకు సాధించిన టీనా దబీ, అథర్ ఖాన్ లు ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వివాహం చేసుకున్న కొన్నాళ్లకే వీరిద్దరూ విడిపోవడం, తాజాగా విడాకులు కూడా మంజూరు కావడంతో ఈ విషయం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. కొన్ని నెలల కిందట టీనా దబీ, అథర్ ఖాన్ తమకు విడాకులు కావాలంటూ జైపూర్ కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ సమర్పించారు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది.

2015 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో కాశ్మీర్ కు చెందిన టీనా దబీ, అథర్ ఖాన్ నెంబర్ వన్ నెంబర్ వన్, టూ ర్యాంకులు సాధించారు. ఐఏఎస్ శిక్షణ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో మతాంతర వివాహం చేసుకున్నారు.కొన్ని నెలలపాటు సజావుగా సాగిన వీరి కాపురంలో ఆ తర్వాత విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిరోజులకు టీనా దబీ, అథర్ ఖాన్ విడిపోయారు.

పరస్పర అంగీకారంతో విడాకుల కోసం జైపూర్ ఫ్యామిలీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. రాజస్థాన్ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ లు టీనా దబీ, అథర్ ఖాన్ ల వివాహానికి రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు, పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకుని మతాంతర వివాహం చేసుకున్న టీనా దబీ, అథర్ ఖాన్ ఆ తర్వాత రెండేళ్ళకే విడిపోవడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -