ఇతడు కదా.. బాలయ్యకు సరైన విలన్..! ఇక థియేటర్లలో అరుపులే..!

- Advertisement -

నందమూరి బాలకృష్ణ నుంచి సినిమా వస్తుందంటే మాస్ సినిమాలను ఇష్టపడే వారికి పండగే. బాలయ్య సినిమాలో భారీ డైలాగ్ లకు, విలన్లకు, ఫైట్లకు ఢోకా ఉండదు. బాలయ్య నటించే సినిమాలో ఇద్దరు ముగ్గురు విలన్లు కూడా ఉంటారు. అయితే విలన్ ఎంత బలంగా ఉంటే హీరోయిజం కూడా అంతే స్థాయిలో ఎస్టాబ్లిష్ అవుతుంది.

ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం కానుంది. అయితే ఇందులో బాలయ్యను ఢీకొట్టే పాత్రలో ఓ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కనిపించనున్నాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సినిమాలు చేస్తున్నాడు. తన పాత్ర నచ్చితే చాలు ఏ రోల్ అయినా విజయ్ సేతుపతి చేస్తాడు.

- Advertisement -

గత ఏడాది సేతుపతి తమిళ హీరో విజయ్ హీరోగా నటించిన మాస్టర్ సినిమాలో విలన్ రోల్ పోషించాడు. అలాగే తెలుగులో వచ్చిన ఉప్పెన సినిమాలో కూడా విలన్ గా కనిపించి మెప్పించాడు. తాజాగా బాలకృష్ణ సినిమాలో విలన్ గా నటించేందుకు అంగీకారం తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేని సేతుపతి ని కలిసి కథ వినిపించగా నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది. బాలయ్యను ఢీ కొట్టే బలమైన పాత్రకు విజయ్ సేతుపతి ఎంపిక కావడంతో ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయే రేంజ్ లో ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్ ఫెక్ట్ చేస్తున్నారు.

Also Read

మహేష్ దూకుడు.. మరో సెన్సేషనల్ డైరెక్టర్ తో సినిమా..!

బిగ్ బాస్ లోకి సుడిగాలి సుధీర్.. 

నిశ్చితార్థంపై ప్రచారం నిజమే నయనతార

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -