Friday, April 26, 2024
- Advertisement -

‘మళ్లీ రావా’తో రీ ఎంట్రీ ఇచ్చాడు.. ‘మళ్లీ మొదలైంది’ తో సెట్ అవుతాడా..!

- Advertisement -

అక్కినేని నాగేశ్వర రావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. తన తొలి సినిమా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ప్రేమ కథ చిత్రం తో పరిచయమయ్యాడు. మొదట్లో సుమంత్ పై భారీగా అంచనాలు ఉన్నా వరుసగా ఆయనకు పరాజయాలు పలకరించాయి. సుమంత్ చాలా అలస్యంగా సత్యం సినిమా తో ఎట్టకేలకు ఓ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నటించిన గౌరీ పర్వాలేదనిపించింది. గోదావరి, గోల్కొండ హైస్కూల్ సినిమాలు సుమంత్ ని నటుడిగా ఓ మెట్టు ఎక్కించాయి.

గోల్కొండ హైస్కూల్ సినిమా తర్వాత చాలా ఏళ్ల పాటు సుమంత్ కు హిట్ లేదు. కొద్ది రోజుల విరామం తర్వాత సుమంత్ నటించిన మళ్లీ రావా అనే ప్రేమ కథ హిట్ అయ్యింది. ఓ సినిమా హిట్ పడింది అని అనుకునే లోపే మళ్లీ వరుసగా సుమంత్ ని పరాజయాలు పలకరించాయి. ప్రస్తుతం ఆయన ‘మళ్ళీ మొదలైంది ‘ అనే సినిమాలో నటిస్తున్నారు. నైనా గంగూలీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, లైఫ్,ఆఫ్టర్ మ్యారేజ్ అంటూ డిఫరెంట్ మూడ్స్ లో ఉన్న హీరో సుమంత్ నైనా బెడ్ పై ఉన్న స్టిల్స్ ని పోస్టర్ లో చూపించారు. ఈ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది.

రెండో పెళ్లి కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమంత్ నటిస్తుండగా.. ఆయన రెండో పెళ్లి చేసుకోబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వయంగా సుమంత్ ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. తనకు రెండో పెళ్లి నిజజీవితంలో కాదని సినిమాలోనని తేల్చి చెప్పాడు. సుమంత్ ఈ సినిమాతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో మలయాళ హీరో సల్మాన్ దుల్కర్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Also Read

నాని .. అస్సలు తగ్గట్లేదు.. ఏడాదిలోనే మూడు సినిమాలు..!

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

ఓటీటీపై ఎర్రన్న సంచలన కామెంట్లు.. సీఎంలకు చురకలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -