సందీప్ కిషన్ ని ఢీ కొడుతున్న తమిళ స్టార్ హీరో.. ఎవరంటే..!

- Advertisement -

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి భాషలతో సంబంధం లేకుండా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నాడు. అన్ని భాషల్లోనూ విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. విజయ్ సేతుపతి చేతిలో ప్రస్తుతం చాలా సినిమాలున్నాయి. కొన్నేళ్ల పాటు ఆయన కాల్షీట్లు దొరికే పరిస్థితి లేదు అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో విజయ్ సేతుపతి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సైరా సినిమాలో కీలకమైన పాత్రలో నటించి మెప్పించాడు. అదే ఆయన నటించిన తొలి తెలుగు సినిమా.

ఆ తర్వాత సేతుపతి వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన సినిమాలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తెలుగులో మరో సినిమా చేసేందుకు సేతుపతి అంగీకారం తెలిపినట్లు సమాచారం. యువ హీరో సందీప్ కిషన్ హీరోగా ది ఫ్యామిలీ మాన్ వెబ్ సీరిస్ తో పేరు తెచ్చుకున్న రాజు అండ్ డీకే సమర్పకులుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీని రంజిత్ నిర్మిస్తుండగా భరత్ చౌదరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

- Advertisement -

ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించేందుకు విజయ్ సేతుపతిని చిత్ర యూనిట్ సంప్రదించినట్లు సమాచారం. కథ నచ్చడంతో సేతుపతి కూడా ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో సేతుపతి విలన్ గానే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల తమిళ హీరో విజయ్ నటించిన సినిమాలో సేతుపతి ఢీ అంటే ఢీ అనే పాత్రలో నటించి మెప్పించాడు. సందీప్ కిషన్ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాకు సంబంధించిన వివరాలను మేకర్స్ అతి త్వరలోనే వెల్లడించనున్నారు.

Also Read

‘మా’ లో ముసలం.. కృష్ణంరాజుకు ఈసీల లేఖ కలకలం

త్రిష పెళ్లి వార్తలు నిజం కాదట..!

ఓ రేంజ్ లో అఖండ ఇంటర్వెల్ బ్యాంగ్..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -