Thursday, May 9, 2024
- Advertisement -

ఆహాలో సూపర్​డీలక్స్​.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

- Advertisement -

తమిళ నటుడు విజయ్​ సేతుపతి ప్రస్తుతం పాన్​ఇండియా స్టార్​గా ఎదిగాడు. భాషతో నిమిత్తం లేకుండా తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో ఆయన నటిస్తున్నారు. తెలుగులో ఉప్పెన చిత్రంలో నటించి ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు విజయ్​ సేతుపతి. దీంతో ఆయన నటించిన తమిళ చిత్రాలను తెలుగులోకి డబ్​ చేస్తున్నారు. ఇటీవల విక్రమార్కుడు అనే సినిమాను ఆహా ఓటీటీ వేదికగా తెలుగులో విడుదల చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేదు.

అయితే విజయ్​ సేతుపతి ట్రాన్స్​జెండర్​గా నటించిన తమిళ సినిమా సూపర్​ డీలక్స్​ ను తెలుగులోకి డబ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్​ చేయబోతున్నారు. ఈ మేరకు ఆహా ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెట్టింది. సూపర్​ డీలక్స్​లో విజయ్​ నటనకు ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాలో సమంతా అక్కినేని, రమ్యకృష్ణ, ఫాహద్​ ఫాసిల్​ కూడా కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 6న ఈ సినిమా స్ట్రీమింగ్​ కాబోతున్నది.

తమిళ, మలయాళంలో సక్సెస్​ అయిన చిత్రాలను ఆహా తెలుగులో డబ్ చేస్తోంది. ప్రతి వారం ఓ రెండు సినిమాలను స్ట్రీమింగ్​ చేస్తుంది. ఈ వారం హీరో, నీడ చిత్రాలు విడుదలయ్యాయి. విజయ్​ సేతుపతికి తెలుగులోనూ మంచి ఆదరణ ఉండటంతో.. ఆయన చిత్రాలను వరసగా డబ్​ చేస్తోంది ఆహా. తమిళంలో సక్సెస్​ అయిన సూపర్​ డీలక్స్​ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారో? లేదో? వేచి చూడాలి.

Also Read

బిచ్చగాడు 2 వచ్చేస్తోంది.. డైరెక్టర్​ ఎవరంటే?

రజనీ -దీపిక.. కాంబినేషన్ రిపీట్..!

భీమ్​ విషయం ఓకే.. మరి అల్లూరి సంగతేంటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -