రెండో పెళ్ళికి సిద్ధమైన సుమంత్.. వధువు ఎవరంటే..!

- Advertisement -

అక్కినేని నాగేశ్వరావు మనవడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ప్రేమ కథ ఆయన తొలి చిత్రం. కెరీర్ ఆరంభంలో ఆయన పై భారీగానే అంచనాలు ఉన్నప్పటికీ ఒక్క హిట్ సినిమా కూడా పడలేదు. కెరీర్ ప్రారంభించిన చాలా ఏళ్ల తర్వాత సత్యం సినిమా తో సుమంత్ తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత గోదావరి మూవీతో మరో సక్సెస్ దక్కింది.

అయితే సుమంత్ సినీ కెరీర్ ప్రారంభించి 20 ఏళ్ళు దాటినప్పటికీ ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లతో పాటు కెరీర్ ప్రారంభించిన సుమంత్ అగ్రహీరో స్థాయిని అందుకోలేకపోయాడు. కొన్నేళ్ల విరామం తర్వాత రీ ఎంట్రీలో సుమంత్ మళ్లీ రావా సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తున్నాడు.

- Advertisement -

2004లో ఆయన హీరోయిన్ కీర్తి రెడ్డి ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో 2006లో విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి మరొకర్ని పెళ్లి చేసుకుని సెటిల్ అవగా విడాకులు తీసుకొని 15 ఏళ్లు గడిచినా సుమంత్ మాత్రం ఒంటరిగానే ఉంటున్నాడు.

అయితే ఇప్పుడు సుమంత్ మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కొంత మందికి వెడ్డింగ్ కార్డు కూడా అందజేసినట్లు సమాచారం. పవిత్ర అనే అమ్మాయిని సుమంత్ వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం సుమంత్, పవిత్రల వెడ్డింగ్ కార్డు వైరల్ గా మారింది. వీరి పెళ్లి అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరుగనుంది. అయితే సుమంత్ పెళ్లిపై అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -