ఒక ప్రముఖ ఛానల్ లో వచ్చే డియర్ స్వామీజీ అనే కార్యక్రమానికి ఒక్కో సెలబ్రిటీని ఆహ్వానించి వారి అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంటారు. ఈ కార్యమంలో భాగంగా యాంకర్ సుమ.. ‘స్వాములకు రాజకీయాలు అవసరమా?’ అని ప్రశ్నించగా.. స్వామి అందుకు దీటైన జవాబు ఇచ్చారు.
స్వాములకు రాజకీయాలెందుకని రాజకీయ నేతలే ప్రశ్నిస్తున్నారని చెప్పిన ఆయన, స్వాములను చూస్తే నేతలకు భయమని అన్నారు.. సాధారణంగా రాజకీయ నాయకులకు కుటుంబం ఉంటుందని, వాళ్ల వ్యాపారాలు, ఇంటి పనులు చక్కబెట్టుకుంటూ.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా సేవ చేయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీని ఉదాహరణగా చూపారు. ఆయన ఓ సన్యాసని, భార్య, పిల్లలు, ఇల్లు లేని ఆయన రాజకీయాల నుంచి బయటకు వస్తే, ఓ బ్యాగ్ భుజాన వేసుకుని ఆర్ఎస్ఎస్ లోకి వెళ్లి ప్రచారం చేసుకుంటారని.. లేకుంటే, ఏ రుషీకేష్ కో వెళ్లి తపస్సు చేసుకుంటారని చెప్పుకొచ్చారు.
{loadmodule mod_custom,Side Ad 1}
మిగతా రాజకీయ నాయకులు అలా చేయలేరని, వాళ్ల వెనుక చాలా బాధ్యతలు ఉండటమే ఇందుకు కారణమని చెప్పుకొచ్చారు. ఎటువంటి బాధ్యతలు, బాదరబందీ లేని వాళ్లు రాజకీయాల్లోకి వస్తే, ప్రజల కష్టాలు తీర్చడంతో పాటు ప్రజలకు ఎంతో కొంత మేలు జరుగుతుందని జోష్యం చెప్పారు.
{youtube}zeO4k5JCFV8{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related