పవన్ కళ్యాణ్ ని ఆంధ్రప్రదేశ్ సీఎం గా చూడాలనేది ఆయన ఫ్యాన్స్ ఆశ. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు తెలపడంతో తమ కల నిజమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగానే పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలీ డైరెక్షన్ లో కాటమరాయుడు మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానే వెంటనే త్రివిక్రమ్ సినిమా మొదలు కానుంది. ఈ మూవీ రాజకీయ నేపథ్యంలో ఉంటుందని.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ ఈ కథని రాసినట్లు సమాచారం. పవన్ పొలిటికల్ కెరీర్ కి ఉపయోగ పడే విధంగా ఇందులో డైలాగులు ఉంటాయని, అంతేకాకుండా సీన్లు కూడా ప్రేక్షకులను ఆలోచింపజేసేదిగా ఉంటుందని తెలుస్తోంది. తాజా క్లైమాక్స్ లో పవన్ ని ముఖ్యమంత్రి చేసే విధంగా కథ కంప్లీట్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వాసులు అంటున్నారు. అయితే ఫ్యాన్స్.. సంవత్సరం ముందే వెండితెరపై పవన్ ని ముఖ్యమంత్రిగా చూడబోతున్నారన్నమాట.
Related
