Friday, March 29, 2024
- Advertisement -

‘ఆర్ఆర్ఆర్’ డిజిటల్ రైట్స్ 200 కోట్లు !

- Advertisement -

దర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తుందంటే చాలు దేశంలోనే కాకుండా అంత‌ర్జాతీయంగానూ ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఎందుకంటే ఆయ‌న తీసే సినీమాలు హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయి. మరీ ముఖ్యంగా బ‌హుబ‌లి, బ‌హుబ‌లి -2 సినిమాల‌తో ఆయ‌న‌కున్న క్రేజ్ మ‌రింత‌గా పెరిగిపోయింది.

ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం జ‌క్క‌న్న ద‌ర్శ‌క‌త్వంలో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కులు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌లు హీరోలుగా “ఆర్ ఆర్ ఆర్” సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. దాదాపు 400 రూపాయల కోట్ల‌తో నిర్మిస్తున్నారు. అయితే, విడుద‌ల‌కు ముందే ఈ సినిమా నిర్మాణ ఖ‌ర్చులో సగం రాబ‌ట్టిన‌ట్టు స‌మాచారం.

ఆర్ ఆర్ ఆర్ సినిమా బిజినెస్ క‌ళ్లు చేదిరే స్థాయిలో ఉంటుంద‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే థియేట్రికల్ హక్కుల విషయంలో రికార్డు సృష్టిస్తోంది. మరోపక్క తాజాగా డిజిటల్ హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడుపోయినట్టు సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. స్టార్ నెట్ వర్క్ కు చెందిన డిస్నీ హాట్ స్టార్ ఈ చిత్రం ఓటీటీ హక్కులను సుమారు 200 కోట్ల రూపాయ‌ల‌కు ద‌క్కించుకుంద‌ని స‌మాచారం. తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, త‌మిళ భాష‌ల్లో ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో అందుబాటులో ఉండ‌నున్న‌ట్టు తెలిసింది.

‘సత్యమేవ జయతే..’ అంటూ అద‌ర‌గొడుతున్న ప‌వ‌న్

అప్పుల్లో నాల్గో స్థానంలో ఏపీ

రెక్వెస్ట్ కాదు.. వార్నింగ్ : బండి సంజయ్

బాక్సింగ్ రింగులోకి రాశిఖన్నా! అందుకేనా..

‘పైన పటారం.. లోన లోటారం’ అంటున్న అన‌సూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -