Friday, May 3, 2024
- Advertisement -

నాగార్జున పనైపోయిందా ?

- Advertisement -

టాలీవుడ్ లో మన్మథుడు గా అక్కినేని నాగార్జున కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఐదు పదుల వయసులో కూడా గ్లామర్ విషయంలో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్నాడు. అయితే కొన్నాళ్లుగా నాగార్జున సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధిచడం లేదు. 2016 లో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన మూవీ తరువాత ఆ స్థాయిలో విజయం సాధించిన సినిమాలు ఒక్కటి కూడా లేదు. రాజుగారి గది 2, మన్మథుడు 2, ఆఫీసర్, వైల్డ్ డాగ్, వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇక ఈఏడాది తనయుడు నాగచైతన్య తో కలిసి నటించిన ” బంగార్రాజు ” కూడా యావరేజ్ హిట్ గానే మిగిలింది. .

ఇక తాజాగా నాగ్ నుంచి వచ్చిన లేటెస్ట్ మూవీ ” ఘోస్ట్ ” కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేసింది. దీంతో నాగార్జున కెరియర్ గ్రాఫ్ పడిపోయిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే నాగార్జున సినిమాలకు గతంలో ఉన్న క్రేజ్ ప్రస్తుతం కనిపించడం లేదు. ఇక ” ఘోస్ట్ ” ఎలాగైనా హిట్ ట్రాక్ ఎక్కాలని భావించిన నాగార్జునకు మళ్ళీ నిరాశే ఎదురైంది. దీంతో నాగ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ పై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం బిగ్ బాస్ 6 రియాలిటీ షో తో బిజీగా ఉన్న నాగ్.. తదుపరి ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తాడో చూడాలి. ఏది ఏమైనప్పటికి వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగ్ మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుందాం.

Also Read

ఎన్టీఆర్ కోసం బడా హీరో.. కొరటాల భారీ స్కెచ్ ?

పుష్ప పార్ట్ 2 లో బాలీవుడ్ స్టార్ హీరో ?

గాడ్ ఫాదర్ : అంతా బాగుంది కానీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -