Monday, April 29, 2024
- Advertisement -

మొబైల్ నెట్వర్క్ ను 4G నుంచి 5G కి మార్చండిలా !

- Advertisement -

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ యుగం అత్యాధునిక టెక్నాలజీ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. దీంతో టెక్నాలజీకి తగినట్లుగా యూజర్స్ కూడా అప్డేట్ అవుతున్నారు. ఇక ఇప్పటికే 4G నుంకి 5G కి ఆయా దేశాలు అప్డేట్ అయ్యాయి. ఇక ఇప్పుడు మనదేశం వంతు వచ్చింది. ఇటీవల అక్టోబర్ 1 న జరిగిన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ( IMC ) సమావేశంలో మనదేశ ప్రధాని నరేంద్ర మోడి అధికారికంగా 5జి సేవలను ప్రారంభించారు. దీంతో ఆయా టెలికాం కంపెనీలు యూజర్స్ కు 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు అన్నీ విధాలుగా సిద్దమయ్యాయి. .

ఇక ఇప్పటికే ఎయిర్ టెల్ ( Airtel ) కొన్ని ప్రధాన నగరాలలో 5G సేవలను ప్రారంభించింది. ఇక దసరా సందర్బంగా టెలికాం దిగ్గజ సంస్థ జియో ( Jio ) కూడా ఆయా నగరాలలో 5జి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మరి కొద్ది రోజుల్లోనే ఇండియా మొత్తం 5జి విస్తరించే అవకాశం ఉంది. దీంతో మొబైల్ యూజర్స్ అందరూ 5G కి అప్డేట్ అయ్యేందుకు అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రస్తుతం 4జి సిమ్ లు వాడే వారు కూడా 5G నెట్వర్క్ కు కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని టెలికాం కంపెనీలు ప్రకటిస్తున్నాయి. మరి 4G సిమ్ ఉన్నప్పటికి 5G నెట్వర్క్ కు ఎలా కనెక్ట్ అవ్వాలో తెలుసుకుందాం !
( గమనిక : 5G మొబైల్స్ కు మాత్రమే )

*ముందుగా మొబైల్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
*ఆ తరువాత mobile networks ను ఎంచుకోవాలి.
*ఆ తరువాత మీరు 5జి నెట్వర్క్ ఎంచుకోవాల్సిన sim ను ఎంచుకోవాలి.
*ఆ తరువాత ఆటోమాటిక్ నెట్వర్క్ ఆఫ్ చేయాలి.
​*ఆ తరువాత manual గా నెట్వర్క్ సర్చ్ చేయాలి. ​

*అప్పుడు మిరున్న ప్రదేశంలో 5G అందుబాటులోకి వచ్చి ఉంటే.. అక్కడ 3G, 4G, లతో పాటు 5G కూడా చూపిస్తుంది.

​అప్పుడు ప్రివరెన్స్ నెట్వర్క్ గా 5G ని సెలెక్ట్ చేసుకొని..5G స్పీడ్ ను ఆస్వాదించవచ్చు.

Also Read

వాట్సప్ : మీరు ఆన్లైన్ లో ఉంటే.. ఈ సెట్టింగ్ చేసుకోండీ !

రాత్రి నిద్రించే ముందు ఈ ఆహారంతో ఆరోగ్యానికి మేలు !

ఈ జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ రాదట!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -