Thursday, May 2, 2024
- Advertisement -

BRS ప్రభావం ఏపీలో ఉంటుందా.. నష్టం జగన్ కా ? బాబు కా ?

- Advertisement -

తెలంగాణ సి‌ఎం కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లోకి దసరా సందర్భంగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. తను స్థాపించిన టి‌ఆర్‌ఎస్ ( TRS ) పార్టీనే పేరు మార్చి బి‌ఆర్‌ఎస్ ( BRS ) జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ముందడుగు వేశారు. దసరా సందర్భంగా తెలంగాణ భవన్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో అధికారికంగా బి‌ఆర్‌ఎస్ ( BRS ) పార్టీతో ఎంట్రీ ఇచ్చారు కే‌సి‌ఆర్. అయితే కే‌సి‌ఆర్ జాతీయ రాజకీయాల్లో ఎంతమేర రాణిస్తాడు అనే విషయం పక్కన పెడితే.. ఆంధ్ర ప్రదేశ్ పట్ల కే‌సి‌ఆర్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే కావేరి నది జలాల విషయంలోనూ, పోలవరం ముంపు గ్రామాల విషయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాల మద్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనెంతలా వివాదం కొనసాగుతూనే ఉంది. .

ఈ నేపథ్యంలో జాతీయ పార్టీ అధినేతగా కే‌సి‌ఆర్ ఇలాంటి సున్నితమైన అంశాలపై కే‌సి‌ఆర్ వైఖరి ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతులుతున్న ప్రధాన ప్రశ్న. ఇక విభజన హామీలలో భాగంగా ప్రత్యేక హోదా విషయంలో ఆంద్రప్రదేశ్ ఇప్పటికీ కూడా పోరాడుతూనే ఉంది. మరి ప్రత్యేక హోదా విషయంలో కే‌సి‌ఆర్ ఎలా స్పందిస్తారు అనేది కూడా ఆసక్తికరమే. ఇక జాతీయ పార్టీగా బి‌ఆర్‌ఎస్ ( BRS ) ఆంధ్రప్రదేశ్ లో కూడా కచ్చితంగా పాగా వేసేందుకు అవకాశం ఉంది. మరి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రధాన పార్టీలుగా కొనసాగుతున్న వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు బి‌ఆర్‌ఎస్ ( BRS ) పార్టీపై ఎలా వ్యవహరించనున్నాయి అన్నది కూడా ఏపీ రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్న అంశం.

ఇక మొదటి నుంచి కూడా కే‌సి‌ఆర్ మరియు వైఎస్ జగన్ సన్నిహితంగానే మెలుగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కే‌సి‌ఆర్ పార్టీ ఏపీలో పోటీ చేస్తే జగన్ మరియు కే‌సి‌ఆర్ మద్య దూరం పెరిగే అవకాశం ఉంది. ఇక మరోవైపు టీడీపీ పై మొదటి నుంచి నిప్పులు చెరిగే కే‌సి‌ఆర్ ఈసారి మరింత పెంచే అవకాశం ఉంది. ఇక జనసేన విషయానికొస్తే.. పవన్ బి‌ఆర్‌ఎస్ ( BRS ) ను ఎంతమేరకు స్వాగతిస్తాడు అనేది ప్రశ్నార్థకమే. ఒకవేళ ఏపీలో బి‌ఆర్‌ఎస్ ( BRS ) పోటీ చేస్తే చాలా మంది నేతలు బి‌ఆర్‌ఎస్ లో చేరిందుకు సిద్దంగా ఉన్నారని.. బి‌ఆర్‌ఎస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. ఇక గతంలో కే‌సి‌ఆర్ కూడా ఏపీలో పోటీ చేసేందుకు సిద్దంగానే ఉన్నట్లు పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. ఒకవేళ కే‌సి‌ఆర్ ఏపీలో పోటీచేస్తే అధిక నష్టం వైసీపీ కా ? లేదా టీడీపీ కా ? అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Also Read

ఏపీ మరో నైజీరియా అవుతుందా ?

జగన్ సార్.. ఈ విషయంలో సూపర్ !

రాహుల్ వస్తే ప్రత్యేక హోదా.. తొలి సంతకం అదే !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -