Friday, May 10, 2024
- Advertisement -

ఎన్టీఆర్ మళ్లీ ఎందుకు లావు అయ్యాడో తెలుసా?

- Advertisement -

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనత గ్యారేజ్ వంటి వరస్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటివలే వచ్చిన జనత గ్యారేజ్ అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఏంటి అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. జనత గ్యారేజ్ విడుదలై 50 రోజులు అయిపోయిన ఇంకా ఎన్టీఆర్ తన తదుపరి సినిమా విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు.

అయితే ఇటివలే జరిగిన ఇజం ఆడియో వేడుకలో అయిన తన తదుపరి సినిమా గురించి చెపుతారు అనుకున్నారు అంతా. కానీ ఇక్కడ కూడా ఎన్టీఆర్ నోరు విప్పలేదు. అయితే ఇజం ఆడియో కు వచ్చిన ఎన్టీఆర్ ను చూసి అభిమానులు అంత ఒక్కసారిగా షాక్ అయ్యారు మళ్లీ ఎందుకు ఎన్టీఆర్ లావు అయ్యాడు అని. అయితే టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తన తదుపరి సినిమాలో భాగంగానే ఎన్టీఆర్ మళ్లీ లావు అవుతున్నాడట.

ఆ సినిమాని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కళ్యాణ్ రామ్ బాక్సర్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ టైటిల్ ఎన్టీఆర్ కోసమే అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో మరి ఎన్టీఆర్ ఈ సినిమా కోసమే లావు అవుతున్నాడా లేక మాములుగా లావు అయ్యాడా అనే విషయంపై క్లారీటీ రావాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

{youtube}txGg-kBWp2A{/youtube}

Related

  1. exclusive: కె.రాఘవేంద్రరావు తో ఎన్టీఆర్ సినిమా!
  2. ఎన్టీఆర్ కి షాకింగ్ నిజాలు చెప్పిన శృతీహాసన్‌!
  3. ఎన్టీఆర్ గ‌ర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?
  4. బాహుబలి-3 లో రాజుగా ఎన్టీఆర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -