Monday, April 29, 2024
- Advertisement -

విడుదల రోజు ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాలు!

- Advertisement -
tollywood movies first day collections

ఇప్పుడు తెలుగు సినిమాల సక్సెస్ ను ఆ సినిమాలు చేసిన కలక్షన్లను బట్టి డిసైడ్ చేస్తున్నారు. అందుకే ఎక్కువ థియేటర్లలో సినిమాలను విడుదల చేసి బాక్స్ ఆఫీస్ ని బద్ధలుకొడుతున్నారు. ఈ రేసులో ఫస్ట్ డే, ఫస్ట్ వీక్ కలెక్షన్లు కీలకమవుతున్నాయి.

తొలి రోజు ఎక్కువగా కాసులు కురిపించిన చిత్రమే నిర్మాతలకు లాభాన్ని ఇస్తున్నాయి. అలా అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ టెన్ సినిమాలు ఇవే..

* ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం తొలి రోజు 75 కోట్లను వసూల్ చేసి ఆశ్చర్యపరిచింది. మొదటివారానికి 225 కోట్లను కొల్లగొట్టి తిరుగులేదని అనిపించుకుంది. ఈ సినిమా మొత్తం మీద 602 కోట్లు రాబట్టి టాలీవుడ్ టాప్ గ్రాసర్ గా నిలిచింది.

* పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ గా ఆకట్టుకోకపోయినా.. ఆ సినిమా మాత్రం మొదటి రోజు 40 కోట్లు వసూల్ చేసి పవన్ పై అభిమానుల్లో ఉన్న క్రేజ్ ని చూపించింది. ఇక మూవీ మొదటి వారానికి 73 రాబట్టింది.

* సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు తొలి రోజు 30 కోట్లను రాబట్టింది. మొదటివారం పూర్తి అయ్యేసరికి ఈ మూవీ 101 కోట్లను వసూల్ చేసి ప్రిన్స్ సత్తాను చాటింది. మొత్తం మీద 144 కోట్లతో మహేష్ శ్రీమంతుడు అనిపించుకున్నాడు.

* యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్లాస్ నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా క్లాస్ ప్రజలను ఆకట్టుకొని మొదటి రోజు 24 కోట్లను తన అకౌంట్లో వేసుకుంది. తొలి వారానికి 43 కోట్లను వసూల్ చేసింది.

* ఈ ఏడాది విడుదలైన వాటిలో కలెక్షన్లతో రికార్డ్ సృష్టించింది జనతా గ్యారేజ్. తారక్ నటించిన ఈ సినిమా తొలి రోజు 20.5 కోట్లు వసూల్ చేయగా, మొదటి వారానికి వంద కోట్ల క్లబ్ లో చేరింది.

* స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “సరైనోడు” చిత్రం మొదటి రోజు 14.4 కోట్లు కలక్షన్స్ పట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తొలి వారానికి “సరైనోడు” ప్రపంచవ్యాప్తంగా 70 రాబట్టాడు. మొత్తానికి బన్నీ 127 కోట్లు కొల్లగొట్టి మెగా పవర్ చూపించాడు.

* అత్తారింటికి దారేది చిత్రం విడుదలై మూడేళ్లు అవుతున్నా, ఆ సినిమా నమోదు చేసిన రికార్డులు పవన్ కళ్యాణ్ రేంజ్ ని గుర్తుచేస్తున్నాయి. ఈ మూవీ తొలి రోజు 10 కోట్లు వసూల్ చేసింది. తొలి వారానికి 47 కోట్లను రాబట్టింది.

* మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన బ్రూస్ లీ తొలి రోజు 10 కోట్లు వసూల్ చేయగా, మొదటి వారానికి 53 కోట్లను రాబట్టింది. ఈ సినిమాపై మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వారంలోనే 50 కోట్ల క్లబ్ లో బ్రూస్లీ చేరడం విశేషం.

* కొత్త కథ, కథనంతో ఎవడు మెగా ఫ్యాన్స్ ని అలరించింది. రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ తో అదరగొట్టిన ఈ మూవీ ఫస్ట్ డే 8.65 కోట్లు, ఫస్ట్ వీక్ 36 కోట్లు వసూల్ చేసింది.

* చెర్రీ నటించే చిత్రాలు మినిమమ్ గ్యారంటీ అని అతని చిత్రాల రికార్డులను పరిశీలిస్తే అర్ధమవుతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గోవిందుడు అందరివాడేలే సినిమా తొలి రోజు 8.55 కోట్లు, తొలి వారం 27.5 కోట్లు రాబట్టింది.

Related

  1. వరుణ్ సందేశ్ కథ ముగిసిందా?
  2. బాల‌య్య తో మహేష్ సినిమా!
  3. పవన్ దెబ్బకి షాక్ లో ఉన్న మ‌హేష్‌ బాబు!
  4. జబర్దస్త్ గురించి ఎవరికి తెలియని నిజాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -