Wednesday, May 8, 2024
- Advertisement -

ఇప్పుడు మార్చి ఏం లాభం!!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ఏపీలో అయితే.. ఇప్పటికే నామరూపాల్లేకుండా పోయింది. ఎవరు పార్టీలో ఉన్నారో.. ఎవరు లేరో అన్నది.. సొంత పార్టీ నాయకులకే అర్థం కాని పరిస్థితి ఉంది. మరోవైపు.. తెలంగాణలో కూడా పార్టీ బలం రోజురోజుకూ దిగజారుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడల ముందు.. కాంగ్రెస్ పై ఎత్తులు తేలిపోతున్నాయి. నాయకత్వ లోపం కూడా కాంగ్రెస్ కు సంకటంగా మారింది. ఈ రెండు రాష్ట్రాలే కాదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఇలాగే ఉంది. ఇన్నాళ్లూ సోనియా గాంధీ నాయకత్వంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పరిస్థితి.. ఇప్పుడు మాత్రం నేల చూపులు చూసే దశకు చేరింది.

ఈ పరిస్థితిని గమనించి అధిష్టానం.. నష్టనివారణ చర్యలకు సిద్ధమైందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచే ఈ పని మొదలు పెట్టే ప్రయత్నంలో.. కాంగ్రెస్ అధష్టానం ఇప్పటికే కసరత్తు మొదలు పెట్టినట్టు.. పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ కు ఎక్కువ మంది ఎంపీలను అందించి.. కేంద్రంలో అధికారం దక్కించుకునేందుకు కారణమైన తెలుగు రాష్ట్రాల ప్రజలను.. మళ్లీ పార్టీకి దగ్గరికి చేర్చే ప్రయత్నం జరుగుతోంది.

ఉమ్మడి ఏపీ విభజనకు ముందు నుంచీ.. పార్టీకి ఇన్ చార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్.. ఇప్పటివరకూ పదవిలో కొనసాగుతున్నారు. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ బాధ్యతలను ఆయనే చూస్తున్నారు. కానీ.. రీసెంట్ గా.. దిగ్విజయ్ వ్యవహార శైలిపై విమర్శలు పెరుగుతున్నాయి. ఏపీలో ఒకమాట.. తెలంగాణలో మరో మాట చెబుతూ.. పార్టీ వర్గాలను దిగ్విజయ్ ఇబ్బందుల్లో పడేస్తున్నారని అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న అధిష్టానం.. ఈ నెలాఖరులోపే ఇతర సీనియర్లకు ఆ బాధ్యతలు అప్పజెప్పనుందని తెలుస్తోంది. ఈ సారి వేర్వేరు వ్యక్తులకు తెలుగు రాష్ట్రాల బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమచారం అందుతోంది.

అయితే.. పరిస్థితి ఇంతలా దిగజారాక.. నాయకత్వాన్ని మార్చి ఏం లాభం అన్న మాట.. పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. చూడాలి.. వచ్చే కొత్త నాయకులు ఎవరో. ఇన్ చార్జ్ లుగా ఎంత మేరకు ప్రభావం చూపిస్తారో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -