Saturday, April 20, 2024
- Advertisement -

రామారావు ఆన్ డ్యూటీతో రీ ఎంట్రీ ఇస్తున్న ఒకప్పటి హీరో.. ఎవరంటే..!

- Advertisement -

1999లో విడుదలైన స్వయంవరం సినిమా తో హీరోగా పరిచయమయ్యాడు వేణు తొట్టెంపూడి. తొలి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు. అవార్డులను సైతం అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన నటించిన చిరునవ్వుతో సినిమా కూడా సూపర్ హిట్ అయింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే వంటి హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి.

ముఖ్యంగా కామెడీ పండించడంలో వేణు దిట్ట. ముందు వరుసగా సూపర్ హిట్లు అందుకున్న వేణును ఆ తర్వాత వరుసగా పరాజయాలు పలకరించాయి. హనుమాన్ జంక్షన్ ఆయనకు చివరి హిట్ మూవీ. ఆ తర్వాత ఆయన సీనియర్ డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో గోపి గోపిక గోదావరి సినిమాలో హీరోగా నటించాడు. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

ఆ తర్వాత కొద్ది రోజుల పాటు గ్యాప్ తీసుకున్న వేణు ఎన్టీఆర్ హీరోగా నటించిన దమ్ము సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. అయితే అది వేణుకు సరైన ఫలితం ఇవ్వలేదు. కొన్ని రోజులుగా ఆయన ఇండస్ట్రీకు దూరంగా ఉంటున్నారు. మళ్లీ ఇంత కాలం తర్వాత రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో వేణు కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ సందర్భంగా వెల్కమ్ అబోర్డ్ అంటూ ఓ పోస్టర్ విడుదల చేశారు.

Also Read

నాని .. అస్సలు తగ్గట్లేదు.. ఏడాదిలోనే మూడు సినిమాలు..!

రెబల్ స్టార్ మూవీలో తొలిసారి సమంత..!

రెండో పెళ్ళికి సిద్ధమైన సుమంత్.. వధువు ఎవరంటే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -