అదిరిపోయే రేంజ్ లో అధీరా లుక్..!

- Advertisement -

ఒక భాషలో తెరకెక్కిన మాస్ సినిమా మరో భాషలో విజయం సాధించడం అరుదే. అది కూడా స్టార్డం కూడా లేని ఓ హీరో నటించిన మాస్ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అదే కేజీఎఫ్. ఆ సినిమా ట్రైలర్ అయ్యేంతవరకు దాని గురించి ఎవరు మాట్లాడుకున్నది లేదు. కానీ ట్రైలర్ విడుదల అయిన తర్వాత ఒక్కసారిగా ఆ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. కన్నడలో భారీస్థాయిలో విడుదలైన ఈ సినిమా ఆ ఇండస్ట్రీతో పాటు తెలుగు,తమిళ, హిందీ భాషల్లో కూడా సంచలన విజయాన్ని అందుకుంది.

ఆ సినిమాలో హీరోగా నటించిన యశ్ దేశవ్యాప్తంగా పేరుతెచ్చుకున్నాడు. మొదటి భాగం రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాను ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ని విలన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాలో సంజయ్ దత్ అధీరా పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే అధీరా గెటప్ లో విడుదలైన సంజయ్ దత్ లుక్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది.

- Advertisement -

తాజాగా సంజయ్ దత్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 నుంచి అధీరా మరో లుక్ పోస్టర్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వెనుక సైన్యం ఉండగా సంజయ్ దత్ స్టైలిష్ గా కళ్ళద్దాలు పెట్టుకుని భారీ ఖడ్గం చేతపట్టుకొని కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ చూస్తే చాలు మొదటి పార్ట్ కు ఏ మాత్రం తగ్గకుండా ఇందులో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని అర్థమవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల ఆగిపోయింది. లేదంటే ఈ పాటికి విడుదలయ్యేది. కేజీఎఫ్ 2 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆ సినిమా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Also Read

నాని .. అస్సలు తగ్గట్లేదు.. ఏడాదిలోనే మూడు సినిమాలు..!

రాధే శ్యామ్ లవ్ స్టోరీ కానే కాదట.. నిజమెంతా ..?

త్రిష పెళ్లి వార్తలు నిజం కాదట..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -