Friday, May 3, 2024
- Advertisement -

‘ఇంద్ర’ విడుదలై నేటికి 19 ఏళ్లు.. సినిమా విశేషాలివే..!

- Advertisement -

చిరంజీవి కెరీర్​లో ఓ బిగ్గెస్ట్​ బ్లాక్​బస్టర్​ ఇంద్ర. ఈ సినిమా సృష్టించిన కలెక్షన్ల సునామీ మాములుది కాదు. ఆరోజుల్లోనే అంటే 2002లోనే దాదాపు రూ.35 కోట్లు కలెక్షన్లు రాబట్టి తెలుగు సినిమా స్థాయిని పెంచింది ఇంద్ర. అప్పట్లో తెలుగులో ఫ్యాక్షన్​ సినిమాలకు విపరీతమైన ఆదరణ ఉండేది. ఇక అటువంటి చిత్రాలను తెరకెక్కించడంలో బీ గోపాల్​ సిద్ధహస్తుడు. ఇక బడ్జెట్​ అంటే ఏ మాత్రం లెక్కచేయకుండా.. భారీ నిర్మాణవిలువతో సినిమాలు తీసే అశ్వనీదత్​. వీరికి తోడు మణిశర్మ మ్యూజిక్​ డైరెక్టర్​. చిరంజీవి సరసన సోనాలీ బింద్రె, ఆర్తీ అగర్వాల్​ హీరోయిన్లు.

ఇలా భారీ అంచనాలతో భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఇంద్ర.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు దాదాపు 2 కోట్ల టికెట్లు అమ్ముడుపోయాయంటే దీని రేంజ్​ ఏమిటో తెలుసుకోవచ్చు. ఈ చిత్రంలోని పాటలన్నీ సూపర్​హిట్​ అయ్యాయి. ఇక చిరు స్టెప్పులు అదుర్స్​ అనిపించుకున్నాయి. దాయిదాయి దామా అనే డ్యాన్స్ స్టెప్​ ప్రేక్షకులను ఉర్రూతలుగించింది.

ఈ చిత్రం విడుదలై నేటికి 19 ఏళ్లు పూర్తయ్యాయి. 2002 జూలై 24న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఇంద్ర ఘన విజయం సాధించింది. ఈ సినిమా డైరెక్టుగా 122 కేంద్రాల్లో 100 రోజులు ఆలస్యంగా విడుదల అయ్యి మరి కొన్ని కేంద్రాల్లో కూడా శత దినోత్సవం జరుపుకుంది. అప్పట్లో ఓ సినిమా ఇన్ని కేంద్రాల్లో వంద రోజులు ఆడటం రికార్డు. అప్పటి వరకు వరుస ప్లాప్ లతో సతమతమవుతున్న చిరుకు ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఇచ్చి ఆయనను మరోసారి తిరుగులేని స్థానంలో నిలబెట్టింది.

Also Read

మహేశ్ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​.. బర్త్​డేకు త్రిబుల్ ట్రీట్..!

భీమ్​ విషయం ఓకే.. మరి అల్లూరి సంగతేంటి?

ప్రభుత్వాలు అనుమతిచ్చినా.. సినిమాల విడుదలకు అడ్డేమిటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -